కలబంద యొక్క 12 ప్రయోజనాలు, అందానికి జుట్టు పెరుగుదలకు మరియు ఆరోగ్యానికి కలబంద, కలబంద చరిత్ర కలబంద ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది, కలబంద జ్యూస్ ఎలా తయారుచేయాలి, కలబంద వల్ల కలిగే నష్టాలు
కలబంద వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు. కలబందని కేవలం అందానికే కాకుండా ఆరోగ్యానికి మరియు రకరకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. కలబంద ఎక్కువగా మన భారతదేశంలోనే దొరుకుతుంది. అన్ని దేశాలు మన దేశంకి వచ్చి ఇక్కడ లభించే ఆయుర్వేదం అలాగే మూలికల నుంచి తయారు చేసే ఔషదాల గురించి తెలుసుకుని వెళ్తుంటే మనం మాత్రం ఆధునిక యుగం మాయలో పడి వీటన్నిటిని వదిలేస్తున్నాము. ప్రపంచ దేశాల వారు మన దగ్గర నుంచి తెలుసుకున్న విషయాలను వాళ్ళ దేశానికీ తీసుకుని వెళ్లి అనేక రకాలుగా వృద్ధి చెందుతున్నారు. కాని మనం మాత్రం వాళ్ల వెనుక తిరుగుతున్నాము. ప్రస్తుత కాలంలో కలబందని ప్రతిఒక్క బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఉపయోగిస్తున్నారు.
ఈ వ్యాసంలో మీకు కలబంద వల్ల కలిగే అన్ని రకాల ప్రయోజనాలను మరియు ఎలా ఉపయోగించాలి అనే వాటి గురించి వివరిస్తాము.
Aloe vera History కలబంద చరిత్ర
కలబందని మొదటగా గుర్తించిండి మన భారతీయులే. కొన్ని వేల సంవత్సరాల క్రితం మన దేశంలో ఉన్న మునులు, ఋషులు తమ ఆశ్రమాలలో వున్న శిష్యులకి ఆయుర్వేదం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ కలబంద ఆవశ్యకతని కూడా వివరించారు. కలబందని ఇంగ్లీషులో Aloe Vera అని పిలుస్తారు. అలాగే సంస్కృతంలో "కుమారీ" అని పిలుస్తారు. కలబంద నుంచి వచ్చే గుజ్జుని ఎండలో పెడితే నల్లగా మారుతుంది. దీనిని మూసంబరం అని అంటారు. మన పూర్వికులు ఈ మూసంబరాన్ని సీసాలో నిల్వ చేసి అనేక ఆరోగ్య సమస్యలకి ఆయుర్వేధంగా ఉపయోగించేవాళ్ళు. కాలక్రమేణా కలబందని కొత్త విధానాలను ఉపయోగించి బ్యూటీ ప్రొడుక్ట్స్ లో విరివిగా ఉపయోగిస్తున్నారు.
కలబంద యొక్క 12 ఉపయోగాలు
కలబంద రసం ఎలా తయారుచేయాలి
Aloe Vera Juice కలబంద రసం తయారుచేయు విధానం :
కలబంద ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది
కలబంద వల్ల మనిషికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
కలబంద వల్ల కలిగే నష్టాలు
కలబంద రసాన్ని తక్కువ మొత్తంలో తీసుకుంటే ఏలాంటి ఇబ్బందులు వుండవు కానీ అధిక మొత్తంలో తీసుకుంటే మాత్రమే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి.
జుట్టు పెరుగుదలకు కలబంద
1. జుట్టు పెరుగుదలకు తేనె మరియు కలబంద గుజ్జు
కావలసినవి:
ఉపయోగించు విధానం:
ఇలా చేయడం వల్ల జుట్టు ఊడిపోవద్దం తగ్గి చుండ్రు సమస్యలు దూరం అవుతాయి మరియు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
2. జుట్టు పెరుగుదలకు కాస్టర్ ఆయిల్ (ఆముదం) మరియు కలబంద
కావలసినవి:
ఉపయోగించు విధానం:
ఇలా చేయడం ద్వారా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది మరియు జుట్టు మృదువుగా తయారవుతుంది.
3. జుట్టు పెరుగుదలకు మెంతులు మరియు కలబంద
కావలసినవి:
ఉపయోగించు విధానం:
మెంతులు సహజంగా చుండ్రు ని దూరం చేసే స్వభావం కలిగి ఉంటుంది మరియు కలబంద జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
4. జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ మరియు కలబంద
కావలసినవి:
ఉపయోగించు విధానం:
ఉల్లిపాయ రసం తలలో వచ్చే చుండ్రు సమస్యలతో పోరాడి తలని శుభ్రం చేస్తుంది. కలబంద ఉల్లిపాయ రసంతో కలిసి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
ఈ ఆర్టికల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. పైన చెప్పిన విధంగా చేస్తే మీ జుట్టు చాలా ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది.

- కలబంద రసాన్ని ప్రతిరోజూ ఉదయాన్నే పడగడుపున తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
- కలబంద రసం తాగడం వల్ల కీళ్ల నొప్పులు చాలా బాగా తగ్గుతాయి.
- కలబంద తలకి పెట్టడం వల్ల తలలో తేమ శాతం పెరిగి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
- తలలో ఉన్న దురదని మరియు చుండ్రు సమస్యలను దూరం చేస్తుంది.
- జుట్టు ఒత్తుగా పొడవుగా మరియు ప్రకాశవంతంగా అయ్యేందుకు సహాయపడుతుంది.
- కలబంద యాంటీ ఏజింగ్ ని నిరోధిస్తుంది.
- ముఖం పైన వచ్చే మొటిమలను తగ్గిస్తుంది.
- ముఖం పైన వున్న సన్నని రంధ్రాలను మరియు ముడుతలను తగ్గిస్తుంది.
- శరీరంపై పేరుకుపోయిన మట్టిని తొలగిస్తుంది.
- జిడ్డు చర్మం కలవారు కలబందని శరీరంపై రాయడం వల్ల జిడ్డు తగ్గిపోతుంది.
- చర్మం నుంచి వచ్చే దుర్వాసనని చాలా బాగా తగ్గిస్తుంది.
- ఒంటిలోని వేడిని తగ్గించి శరీరంలో రక్త ప్రసరణని నియంత్రిస్తుంది.
కలబంద రసం ఎలా తయారుచేయాలి
Aloe Vera Juice కలబంద రసం తయారుచేయు విధానం :
- కొన్ని కలబంద ఆకులను తీసుకుని అడ్డంగా కోసి అందులోని ద్రవాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
- తరువాత ఆ ద్రవాన్ని మిక్సీ జార్ లో వేసుకుని అందులోకి తగినంత నిమ్మరసం అలాగే పుదీనా రసం మరియు కొన్ని నీళ్ళు పోసి జ్యూస్ వచ్చే వరకు మిక్స్ చేయాలి.
- జ్యూస్ రెడీ అయ్యాక అందులో కొంచెం తేనె వేసుకుంటే కలబంద జ్యూస్ తయారయినట్లే.
- ఈ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి, అందానికి చాలా మంచిది.
కలబంద ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది
కలబంద వల్ల మనిషికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
- కలబంద రసం తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసారం మెరుగుపడుతుంది.
- అలాగే జీర్ణ క్రియ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది.
- ముసలితనం లో వచ్చే మొకాళ్ళ నొప్పులు నయం చేస్తుంది.
- చిన్న వయసులో వచ్చే ముసలితనం నిరోదిస్తుంది.
- కంటి సమస్యలను తగ్గించే కంటి చూపు మెరుగుపరుస్తుంది.
కలబంద వల్ల కలిగే నష్టాలు
కలబంద రసాన్ని తక్కువ మొత్తంలో తీసుకుంటే ఏలాంటి ఇబ్బందులు వుండవు కానీ అధిక మొత్తంలో తీసుకుంటే మాత్రమే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి.
- కలబంద రసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల గుండె సంబందిత జబ్బులు వస్తాయి. అందుకే వైద్యులు గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు కలబంధ రసాన్ని తగవద్దు అని చెప్తారు.
- అల్ప రక్తపోటు వున్న వారు కూడా కలబంద రసాన్ని తాగకూడదు.
- ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అస్సలు కలబంద రసాన్ని తాగకూడదు. ఎందుకంటె కలబందలో పాల ఉత్పత్తిని పెంచే గుణాలు ఉంటాయి కాబట్టి.
- ఎవరు అయితే ఎక్కువ మోతాదులో ఈ రసాన్ని తీసుకుంటారో వారు డిహైడ్రషన్ కి గురి అవుతారు.
జుట్టు పెరుగుదలకు కలబంద
1. జుట్టు పెరుగుదలకు తేనె మరియు కలబంద గుజ్జు
కావలసినవి:
- అర కప్పు కలబంద గుజ్జు
- 3 స్పూన్ల స్వచ్ఛమైన కొబ్బరి నూనె
- 2 స్పూన్ల తేనె
ఉపయోగించు విధానం:
- తేనే, కొబ్బరి నూనె, కలబంద గుజ్జుని ఒక గిన్నెలో వేసి బాగా మిశ్రమం అయ్యే వరకు కలపండి.
- ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళకి అప్లై చేసి బాగా మసాజ్ చేయండి.
- ఒక ౩౦ నిమిషాల తరువాత గోరు వెచ్చని లేదా చల్లటి నీటితో స్నానం చేయండి.
- ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.
ఇలా చేయడం వల్ల జుట్టు ఊడిపోవద్దం తగ్గి చుండ్రు సమస్యలు దూరం అవుతాయి మరియు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
2. జుట్టు పెరుగుదలకు కాస్టర్ ఆయిల్ (ఆముదం) మరియు కలబంద
కావలసినవి:
- 5 స్పూన్ల కలబంద గుజ్జు
- 4 స్పూన్ల కాస్టర్ ఆయిల్
ఉపయోగించు విధానం:
- కాస్టర్ ఆయిల్, కలబంద గుజ్జుని ఒక గిన్నెలో వేసి బాగా మిశ్రమం అయ్యే వరకు కలపండి.
- ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళకి అప్లై చేసి బాగా మసాజ్ చేయండి.
- కాస్టర్ ఆయిల్, కలబంద గుజ్జుని తలకి పట్టించి ఒక రాత్రి మొత్తం అలా వుంచి మరుసటి రోజు ఉదయాన్నే తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
ఇలా చేయడం ద్వారా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది మరియు జుట్టు మృదువుగా తయారవుతుంది.
3. జుట్టు పెరుగుదలకు మెంతులు మరియు కలబంద
కావలసినవి:
- 3 స్పూన్ల మెంతులు
- 3 స్పూన్ల కలబంద గుజ్జు
ఉపయోగించు విధానం:
- ఒకరోజు మొత్తం మెంతులను నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు మెంతులని మిక్సీ లో వేసి మెత్తగా ఆడించాలి.
- మెంతుల పేస్ట్ కి కలబంద గుజ్జుని కలిపి జుట్టు కుదుళ్ళకి పట్టించాలి.
- ఒక ౩౦ నిమిషాల తరువాత చల్లటి నీటితో స్నానం చేయండి.
- ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.
మెంతులు సహజంగా చుండ్రు ని దూరం చేసే స్వభావం కలిగి ఉంటుంది మరియు కలబంద జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
4. జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ మరియు కలబంద
కావలసినవి:
- అర కప్పు కలబంద గుజ్జు
- 3 స్పూన్ల ఉల్లిపాయ రసం
ఉపయోగించు విధానం:
- ఉల్లిపాయ రసం, కలబంద గుజ్జుని ఒక గిన్నెలో వేసి బాగా మిశ్రమం అయ్యే వరకు కలపండి.
- ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళకి అప్లై చేసి బాగా మసాజ్ చేయండి.
- ఒక గంట తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయండి.