గోరింటాకు ఎర్రగా పండటానికి తెలుగు చిట్కాలు మరియు గోరింటాకు వల్ల ఉపయోగాలు

గోరింటాకు ఎర్రగా పండటానికి తెలుగు చిట్కాలు, గోరింటాకు వల్ల ఉపయోగాలు, గోరింటాకు మెహందీ పెట్టుకునే సమయంలో చేయకూడని పనులు

గోరింటాకు ఎర్రగా పండటానికి ఏమి చేయాలి:

తెలుగింటి ఆడపడుచులు శుభకార్యాల సమయంలో అందంగా కనబడేందుకు గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకుకి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర వుంది. పూర్వం భారతీయ మహిళలు సహజంగా లభించే గోరింటాకుతో Mehndi తయారు చేసుకునేవాళ్ళు. గోరింటాకు పెట్టుకున్న తరువాత అది బాగా ఎర్ర పెడితే మంచి మొగుడు వస్తాడు అని భావిస్తారు. కానీ మనలో చాల మందికి గోరింటాకు ఎర్రపడాలంటే ఏమి చేయాలో తెలియదు. ఈ ఆర్టికల్ లో మన తెలుగు మహిళల కోసం గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏమి చేయాలో చెప్పాలనుకుంటున్నాము. ఆర్టికల్ ని చివరి వరకు చదవండి.

(మెహందీ) గోరింటాకు ఎర్రగా పండటానికి పాటించవలసిన నియమాలు:

 • గోరింటాకు పెట్టుకునే ముందు చేతులను నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
 • చేతులకు తడి లేకుండా ఉండేందుకు కొంచెం సేపు పొగ పెట్టాలి.
 • తరువాత మీకు నచ్చిన డిజైన్ అలంకరించుకోండి.
 • 6 నుంచి 7 గంటలు గోరింటాకు మీ చేతుల పై ఉంచండి.
 • గోరింటాకు ఎండిపోయిన తరువాత నీటిని ఉపయోగించకుండా కేవలం చేతులను రుద్దడం ద్వారా గోరింటాకును తొలగించండి.
 • మీరు ఇలా చేయడం మెహందీ ఎర్రగా అందంగా ఎక్కువ కాలం ఉంటుంది.
గోరింటాకు వల్ల ఉపయోగాలు:

 • గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎలాంటి చర్మ సమస్యలు రావు.
 • గోరింటాకు చర్మాన్ని మృదువుగా తయారు.
 • గాయాల వల్ల చర్మం పై ఏర్పడిన నల్లటి మచ్చలను నయం చేస్తుంది.
 • గోరు సమస్యలను దూరం చేసి అందమైన గోరు రావడానికి సహాయ పడుతుంది.
 • వెంట్రుకలు నల్లగా మారేందుకు సహాయపడుతుంది.
 • తలలో చుండ్రుని తగ్గించి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
గోరింటాకుతో నిమ్మరసం, చక్కెరను ఎలా ఉపయోగించాలి:

గోరింటాకు చేతిపై అలంకరించుకున్న తర్వాత నిమ్మరసం చెక్కెర ఉపయోగించడం వల్ల గోరింటాకు ఎర్రగా పడుతుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసి బాగా ఉడకబెట్టాలి. తరువాత చక్కెర వేసి నీటిని చల్లార్చి అందులో కొంచెం నిమ్మరసం కలిపి చేతిపై వున్న గోరింటాకు మీద కాసేపు రుద్దాలి. ఇలా చేయడం వల్ల గోరింటాకు బాగా ఎర్రగా పండుతుంది. అలాగే ఎక్కువ కాలం ఎర్రగా ఉంటుంది.

చేతులకు లవంగం పొగ ఆవిరి పట్టడం ద్వారా గోరింటాకు బాగా పండుతుంది

పైన చెప్పిన విధంగా చక్కర , నిమ్మరం అప్లై చేసిన తరువాత లవంగం పొగ ఆవిరి పట్టాలి. ఒక పాన్ మీద లవంగం వేసి వేడి చేస్తే అందులోనుంచి పొగ వస్తుంది. గోరింటాకుని చేతుల నుంచి తీసివేసిన తరువాత ఆవిరి ఆ పొగని పట్టాలి. ఇలా చేయడం వల్ల చేతుల మీద గోరింటాకు ఎక్కువ కాలం ఎర్రగా ఉంటుంది మరియు మంచి వాసన వస్తుంది.

అలాగే ఆవ నూనెను రాయడం వల్ల కూడా గోరింటాకు ఎక్కువ కాలం ఎరుపు రంగుని కలిగి ఉంటుంది. గోరింటాకు పెట్టుకున్న ప్రతిసారి ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

గోరింటాకు మెహందీ పెట్టుకునే సమయంలో చేయకూడని పనులు:

మెహందీ పెట్టుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే గోరింటాకు సారిగా పండదు.

1. మెహందీ పెట్టుకునే ముందు ఎక్కువగా నీరు తాగరాదు.
2. గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఆరు గంటల వరకు ఎలాంటి పనులు చేయరాదు.
3. గోరింటాకు ఎండిన తరువాత సబ్బుతో గాని నీటితో గాని కడగరాదు.
4. చెక్కెర మరియు నిమ్మరసం కలిపిన ద్రావణాన్ని నీకు అప్లై చేయరాదు.
5. మెహందీని (గోరింటాకు) త్వరగా ఆరబెట్టడానికి బ్లో డ్రయ్యర్లు ఉపయోగించవద్దు. ఇలా చేయడం వల్ల మెహందీ డిజైన్ క్షీణిస్తుంది.

మేము రాసిన ఈ ఆర్టికల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. దయచేసి మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం మన పేజిని ఫాలో అవ్వండి.

Related Posts --