How to Make Aloe Vera gel at Home for Skin and Hair Growth and How to use Aloe Vera for Hair Growth

వెంట్రుకల పెరుగుదలకు కలబంద గుజ్జుని ఎలా తయారు చేయాలి, కలబంద గుజ్జు మన జుట్టుకు ఎలా ఉపయోగపడుతుంది, ఇంటి వద్ద కలబంద గుజ్జుని ఎలా తయారు చేయాలి, కలబంద ఉపయోగాలు, కలబంద జుట్టుకి ఎలా ఉపయోగపడుతుంది.

కలబందని ఉపయోగించి మనం మన చర్మ సౌందర్యాన్ని అలాగే ఆరోగ్యాన్ని పొందవచ్చు. కలబందలో అందానికి అవసరమయ్యే విటమిన్ ఆ, సి, మరియు ఏ ఉన్నాయి. ఇవి శరీరానికి కావలసిన పోషకాలను అందించి శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగేందుకు తోడ్పడుతుంది.

ఎప్పుడు అయితే రక్త ప్రసరణ బాగా జరుగుతుందో అప్పుడు వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడి జుట్టు పెరుగుదల మొదలవుతుంది. కలబంద గుజ్జులో ఉండే అమైనో ఆమ్లాలు మరియు ప్రొటీలిటిక్ ఎంజైమ్ల మీ చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు వెంట్రుకల పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది.

ఈ ఆర్టికల్ లో మీకు కలబంద జుట్టు పెరుగుదలకు చేసే మేలుని గురించి వివరిస్తాము.

కలబంద గుజ్జు మన జుట్టుకు ఎలా ఉపయోగపడుతుంది
  • కలబందలో విటమిన్ ఆ, సి, ఏ ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన పోషకాలను అందించి రక్త ప్రసరణని మెరుగుపరుస్తాయి.
  • ప్రోటీలిక్ ఎంజైములను కలిగి వున్నా కలబంద గుజ్జుని తల మీద అప్లై చేసినప్పుడు అది దెబ్బతిన్న కణాలను నయం చేసి వెంట్రుకల పెరుగుదలని మెరుగుపరుస్తుంది.
  • కలబంద విరిగిన జుట్టు చివరి భాగాన్ని సరి చేస్తుంది, అలాగే జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
  • తలలో వచ్చే చికాకుని, దురదని తగ్గించి చుండ్రు సమస్యల్ని దూరం చేస్తుంది.
కలబంద గుజ్జుని ఎలా తయారు చేయాలి
  • సహజంగా కలబంద గుజ్జుని తయారు చేయడానికి మనం కొన్ని కలబంద ఆకులను తీసుకోవాలి తరువాత వాటిని బాగా కడిగి ఆకు మోదళ్ల భాగంలో కొంచెం కత్తిరించి కాసేపు నీళ్ళలో నానబెట్టాలి.
  • అప్పుడు దానిలో ఉన్న పసుపు పచ్చ పసరు బయటికి వెళ్ళిపోతుంది.
  • అలా చేసిన తరువాత కలబంద యొక్క తొక్కని తీసివేసి అందులో వున్న గుజ్జుని మిక్సీలో వేసి మెత్తని గుజ్జు వచ్చే వరకు ఆడించాలి.
  • తరువాత గుజ్జుని బయటికి తీసి ఒక గాజు సీసాలో బధ్రపరచుకోవాలి.
కలబంద గుజ్జుని జుట్టు పెరుగుదలకు ఎలా ఉపయోగించాలి

జుట్టు పెరుగుదలకు మనం ఎప్పుడైనా సహజంగా లభించే కలబంద గుజ్జుని ఉపయోగించాలి. మార్కెట్ లో లభించే కలబంద గుజ్జు ఉపయోగించవద్దు. దీని కోసం మీ ఇంటి దగ్గర లభించే కలబంద ఆకులని తీసుకుని వాటినుంచి గుజ్జుని బయటికి తీసి ఒక గాజు సీసాలో బధ్రపరచుకోవాలి.

1. జుట్టు పెరుగుదలకు తేనె మరియు కలబంద గుజ్జు

కావలసినవి
  • అర కప్పు కలబంద గుజ్జు
  • 3 స్పూన్ల స్వచ్ఛమైన కొబ్బరి నూనె
  • 2 స్పూన్ల తేనె
ఉపయోగించు విధానం
  • తేనే, కొబ్బరి నూనె, కలబంద గుజ్జుని ఒక గిన్నెలో వేసి బాగా మిశ్రమం అయ్యే వరకు కలపండి.
  • ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళకి అప్లై చేసి బాగా మసాజ్ చేయండి.
  • ఒక ౩౦ నిమిషాల తరువాత గోరు వెచ్చని లేదా చల్లటి నీటితో స్నానం చేయండి.
  • ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.
ఇలా చేయడం వల్ల జుట్టు ఊడిపోవద్దం తగ్గి చుండ్రు సమస్యలు దూరం అవుతాయి మరియు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

2. జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ మరియు కలబంద

కావలసినవి
  • అర కప్పు కలబంద గుజ్జు
  • 3 స్పూన్ల ఉల్లిపాయ రసం
ఉపయోగించు విధానం
  • ఉల్లిపాయ రసం, కలబంద గుజ్జుని ఒక గిన్నెలో వేసి బాగా మిశ్రమం అయ్యే వరకు కలపండి.
  • ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళకి అప్లై చేసి బాగా మసాజ్ చేయండి.
  • ఒక గంట తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయండి.
ఉల్లిపాయ రసం తలలో వచ్చే చుండ్రు సమస్యలతో పోరాడి తలని శుభ్రం చేస్తుంది. కలబంద ఉల్లిపాయ రసంతో కలిసి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

3. జుట్టు పెరుగుదలకు కాస్టర్ ఆయిల్ (ఆముదం) మరియు కలబంద

కావలసినవి
  • 5 స్పూన్ల కలబంద గుజ్జు
  • 4 స్పూన్ల కాస్టర్ ఆయిల్
ఉపయోగించు విధానం
  • కాస్టర్ ఆయిల్, కలబంద గుజ్జుని ఒక గిన్నెలో వేసి బాగా మిశ్రమం అయ్యే వరకు కలపండి.
  • ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళకి అప్లై చేసి బాగా మసాజ్ చేయండి.
  • కాస్టర్ ఆయిల్, కలబంద గుజ్జుని తలకి పట్టించి ఒక రాత్రి మొత్తం అలా వుంచి మరుసటి రోజు ఉదయాన్నే తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
ఇలా చేయడం ద్వారా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది మరియు జుట్టు మృదువుగా తయారవుతుంది.

4. జుట్టు పెరుగుదలకు మందార ఆకులు మరియు కలబంద

కావలసినవి
  • 3 స్పూన్ల మందార ఆకుల పేస్ట్
  • 4 స్పూన్ల కలబంద గుజ్జు
ఉపయోగించు విధానం
  • మందరపు ఆకులను పేస్ట్ గ చేసి అందులో సరిపడా కలబంద గుజ్జుని వేసి ఒక మిశ్రమంలాగా చేయండి.
  • ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళకి అప్లై చేసి బాగా మసాజ్ చేయండి.
  • ఒక ౩౦ నిమిషాల తరువాత గోరు వెచ్చని లేదా చల్లటి నీటితో స్నానం చేయండి.
  • ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.
మందరపు ఆకుల పేస్ట్ తలలో ఉన్న వేడిని తగ్గించి తలని చల్లబరుస్తుంది. అలాగే తలలో ఉన్న దురదని దూరం చేస్తుంది. కలబంద రక్త ప్రసరణని మెరుగు పరచి జుట్టు వేగంగా పెరిగేందుకు సహాయపడుతుంది.

5. జుట్టు పెరుగుదలకు మెంతులు మరియు కలబంద

కావలసినవి
  • 3 స్పూన్ల మెంతులు
  • 3 స్పూన్ల కలబంద గుజ్జు
ఉపయోగించు విధానం
  • ఒకరోజు మొత్తం మెంతులను నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు మెంతులని మిక్సీ లో వేసి మెత్తగా ఆడించాలి.
  • మెంతుల పేస్ట్ కి కలబంద గుజ్జుని కలిపి జుట్టు కుదుళ్ళకి పట్టించాలి.
  • ఒక ౩౦ నిమిషాల తరువాత చల్లటి నీటితో స్నానం చేయండి.
  • ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.
మెంతులు సహజంగా చుండ్రు ని దూరం చేసే స్వభావం కలిగి ఉంటుంది మరియు కలబంద జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.