How to Make Onion Juice for Hair Growth and Dandruff Remove and its Benefits

జుట్టు పెరుగుదల మరియు చుండ్రు తొలగించడానికి ఉల్లిపాయ రసం ఎలా తయారు చేయాలి మరియు దాని ప్రయోజనాలు, జుట్టు తిరిగి పెరగడానికి, జాగ్రత్తలు, సూచనలు, ప్రయోజనాలు, శరీరానికి ఎంతో మేలు చేస్తున్న ఉల్లిపాయ రసం.

ఉల్లిపాయ రసం ఎలా తయారు చేసుకోవాలి

ఆధునిక కాలంలో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. పెరుగుతున్న కాలుష్యం వల్ల జుట్టు పాడయిపోతోంది. దాని వల్ల తలలో చుండ్రు సంబంధిత సమస్యలు వస్తున్నాయి. 15 సంవత్సరాలు నిండక ముందే పిల్లలకి తెల్లని జుట్టు వస్తోంది, ఇంకా జుట్టు రాలిపోతోంది. ఇలాంటి ఎన్నో సమస్యలకు ఒక్క ఉల్లిపాయతో సమాధానం చెప్పొచ్చు. అది ఎలాగో మీకు ఈ ఆర్టికల్ లో వివరిస్తాము. చివరి వరకు చదవండి.

తలలో వెంట్రుకలు వేగంగా పెరగాలన్న, చుండ్రు సమస్యలను దూరం చేయాలన్న సల్ఫర్ కెరాటిన్ ఉండాలి. ఎవరికి అయితే ఈ కెరాటిన్ అనేది తక్కువ మోతాదులో వుంటుందో వాళ్ళకి జుట్టు రాలిపోవడం, తెల్లని వెంట్రుకలు రావడం జరుగుతుంది. ఉల్లిపాయలో కెరాటిన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఉల్లిపాయ రసాన్ని జుట్టు కుదుళ్ళకి అప్లై చేయడం వల్ల పోయిన వెంట్రుకల స్థానంలో కొత్త వెంట్రుకలు వస్తాయి.

ఉల్లిపాయలతో ఇలా చేస్తే కొత్త జుట్టు వస్తుంది
  • ఉల్లిపాయను చిన్న ముక్కలుగా చేసి వాటి నుంచి రసాన్ని బయటకు తీయాలి.
  • తరువాత ఆ రసాన్ని జుట్టు కుదుళ్ళకి పట్టించి బాగా మాట్డాన చేయాలి.
  • 15 నిముషాలు ఆగి కుంకుడు కాయ తీసుకుని గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.
  • ఇలా వారానికి 2 సార్లు చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.
వెంట్రుకలు పెరగడం కోసం ఉల్లిపాయ రసాన్ని ఎలా ఉపయోగించాలి

1. వెంట్రుకల పెరుగుదల కోసం కొబ్బరి నూనె మరియు ఉల్లిపాయ రసాన్ని ఎలా ఉపయోగించాలి

కావలసిన పదార్థాలు
  • ఉల్లిపాయ రసం 3 టేబుల్ స్పూన్లు
  • కొబ్బరి నూనె 3 టేబుల్ స్పూన్లు
కొబ్బరి నూనె ఉపయోగించు విధానం
  • ఉల్లిపాయ రసం మరియు కొబ్బరి నూనెను ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.
  • తర్వాత ఆ రసాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించాలి.
  • అరగంట తర్వాత కుంకుడుకాయతో స్నానం చేయాలి.
కొబ్బరి నూనె ఉపయోగాలు

ఉల్లిపాయ రసాన్ని మరియు కొబ్బరి నూనె మిశ్రమం వల్ల జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది.

2. వెంట్రుకల పెరుగుదల కోసం ఆలివ్ ఆయిల్ ఎలా ఉపయోగించాలి

కావలసిన పదార్థాలు
  • ఉల్లిపాయ రసం 3 టేబుల్ స్పూన్లు
  • ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు
ఆలివ్ ఆయిల్ ఉపయోగించు విధానం
  • ఉల్లిపాయ రసం మరియు ఆలివ్ ఆయిల్ ను ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.
  • తర్వాత ఆ నూనె జుట్టు కుదుళ్లకు పట్టించాలి.
  • 5 గంటల తర్వాత కుంకుడుకాయతో స్నానం చేయాలి.
  • అప్పుడు మీ జుట్టు చాలా సిల్కీగా తయారవుతుంది.
ఆలివ్ ఆయిల్ ఉపయోగాలు

ఉల్లిపాయ జుట్టు రాలడాన్ని తగ్గిస్తే ఆలివ్ ఆయిల్ చుండ్రు సమస్యలను దూరం చేస్తుంది.

3. వెంట్రుకల పెరుగుదల కోసం వెల్లుల్లి ఎలా ఉపయోగించాలి

కావలసిన పదార్థాలు
  • వెల్లుల్లి రసం 3 టేబుల్ స్పూన్లు
  • ఉల్లిపాయ రసం 3 టేబుల్ స్పూన్లు
  • ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రసం ఉపయోగించు విధానం
  • వెల్లుల్లి రసం, ఉల్లిపాయ రసం మరియు ఆలివ్ ఆయిల్ ను ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.
  • తర్వాత ఆ నూనె జుట్టు కుదుళ్లకు పట్టించాలి.
  • 2 గంటల తర్వాత కుంకుడుకాయతో స్నానం చేయాలి.
  • అప్పుడు మీ జుట్టు చాలా వేగంగా పెరుగుతుంది.
వెల్లుల్లి రసం ఉపయోగాలు

వెల్లుల్లి బాక్టీరియాని చంపేసి కొత్త జుట్టు రావడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయ జుట్టుని వేగంగా పెరిగేలా చేస్తుంది.

4. వెంట్రుకల పెరుగుదల కోసం బంగాళదుంప ఎలా ఉపయోగించాలి

కావలసిన పదార్థాలు
  • బంగాళాదుంప రసం 3 టేబుల్ స్పూన్లు
  • ఉల్లిపాయ రసం 2 టేబుల్ స్పూన్లు
బంగాళాదుంప రసం ఉపయోగించు విధానం
  • బంగాళాదుంప రసం మరియు ఉల్లిపాయ రసం ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.
  • తర్వాత ఆ నూనె జుట్టు కుదుళ్లకు పట్టించాలి.
  • 30 నిమిషాల తర్వాత కుంకుడుకాయతో స్నానం చేయాలి.
బంగాళాదుంప ఉపయోగాలు

బంగాళాదుంపలో ప్రోటీన్స్, విటమిన్లు అలాగే ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. అందువల్ల ఇది జుట్టు సమస్యలకు ఒక చక్కటి పరిష్కారంగా ఉంటుంది.

5. వెంట్రుకల పెరుగుదల కోసంకోడి గుడ్డు ఎలా ఉపయోగించాలి

ఇంకా మనం కోడి గుడ్డుని కూడా ఉల్లిపాయ రసంతో కలిపి జుట్టుకి పట్టించడం ద్వారా జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. గుడ్డులో వున్న ప్రోటీన్లు జుట్టు కుదుళ్లను పటిష్టంగా చేస్తుంది.

Related Posts --