How to Use Castor Oil for Hair Regrowth and get rid of Dandruff With Castor Oil and Its Benefits.

జుట్టు తిరిగి పెరగడానికి ఆముదం ఎలా ఉపయోగించాలి, ఆముదం ఊడిపోయిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు వచ్చేలా చేస్తుందా, ఆముదంతో చుండ్రుని దూరం చేయడం ఎలా

Castor Oil for Hair Growth:
ఆముదం తల వెంట్రుకలకు చాలా లాభాలను చేకూరుస్తుంది. ఆముదం తలకు రాయడం వల్ల చర్మ సమస్యలు దూరమవుతాయి. వెంట్రుకలు విరిగిపోకుండా కుదుళ్ళు గట్టిగా ఉండేందుకు సహాయపడుతుంది. పూర్వం దక్షిణ భారతదేశంలో అందరు ఆముదంని తలకి రాసుకునేవాళ్ళు. అందువల్లనే వారి వెంటుకలు చాలా కాలం వరకు కూడా తెల్లబడేవి కాదు. ఆముదంని కేవలం తలకి మాత్రమే కాకుండా వంటకాలలో కూడా ఉపయోగించేవాళ్ళు.

జుట్టు పెరగడానికి ఆముదం ఎలా ఉపయోగించాలి
  • ఆముదం పెట్టుకునే ముందు తలస్నానం చేసి తలని పొడిగా ఆరనివ్వాలి.
  • తరువాత ఆముదంని తలకి బాగాపట్టించి 5 నిమిషాల పాటు మర్దన చేయాలి.
  • 4 గంటల తరువాత సహజంగా లభించే సాంపుని ఉపయోగించి గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.
  • ఇలా వారానికి 2 సార్లు చేయడం వల్ల జుట్టు బాగా పెరిగి తెల్ల వెంట్రుకలు రాకుండా చేస్తుంది.

ఆముదం వల్ల కలిగే ప్రయోజనాలు
Castor Oil Benefits
  • జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
  • చుండ్రు సమస్యను దూరం చేస్తుంది.
  • చిట్లిన వెంట్రుకలను సరిచేస్తుంది.
  • కుదుళ్లను బలంగా చేస్తుంది.
  • జుట్టు ఊడిపోయిన స్థానంలో కొత్త జుట్టు వచ్చేలా చేస్తుంది.
  • అలాగే జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది.

ఆముదంతో చుండ్రుని దూరం చేయడం ఎలా

దురద వంటి సమస్య చుండ్రు ద్వారా సంభవిస్తుంది. ఆముదములో రికోనోలెసిక్{Ricin oleic}యాసిడ్, యాంటీ వైరల్, బాక్టీరియా, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండడంవల్ల చుండ్రును తగ్గించడంలో ఇది పనిచేస్తుంది. తలలో వచ్చే దురదని కూడా చాలా బాగా తగ్గిస్తుంది. అందువల్ల వెంట్రుకలు బాగా పెరుగుతాయి.

కావలసినవి
  • 2 టేబుల్ స్పూన్లు స్వచ్ఛమైన ఆముదం
  • 2 టేబుల్ స్పూన్లు కలబంద గుజ్జు
  • 3 చుక్కలు సోల్ ఫ్లవర్ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్
2 టేబుల్ స్పూన్లు కలబంద గుజ్జు, 2 టేబుల్ స్పూన్లు ఆముదం నూనె మరియు 3చుక్కలు సోల్ ఫ్లవర్ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసి ఆ మిశ్రమాన్ని వెంట్రుకల కుదుళ్లకు బాగా రాసుకుని ఒక్క రాత్రంతా ఉంచుకోండి. తర్వాత తేలికపాటి షాంపుతో స్నానం చేయండి. వారానికి 2-3 సార్లు ఒక వారం ఈ పద్ధతిని పాటించడం ద్వారా చుండ్రు సమస్య అన్నది రాదు.

ఆముదం ఊడిపోయిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు వచ్చేలా చేస్తుంది.

ఆముదంలో బాక్టీరియాని చంపేసే గుణం ఉంటుంది. అందువల్ల ఆముదముని మనం మన తలకి రాసుకున్నప్పుడు అది మన తలలో ఉన్న బాక్టీరియాని చంపేస్తుంది. తద్వారా తల శుభ్రంగా మారి కొత్త వెంట్రుకలు వచ్చేందుకు సహాయపడుతుంది.

ఆముదం జుట్టు చివర్లలో విరిగిపోకుండా చేస్తుంది

ఆముదంలో అనేక విటమిన్లు ఉంటాయి. అవి మన వెంట్రుకలు మృదువుగా మారేందుకు కృషి చేస్తాయి. ఇంకా మనం ఆముదంకి కొబ్బరి నూనె కలిపి వెంట్రుకలకి రాసుకోవడం వల్ల వెంట్రుకల యొక్క చివరి భాగం చిట్లి పోకుండా చేస్తుంది. దానివల్ల వెండ్రుకలు చాలా వేగంగా పెరుగుతాయి.

మేము రాసిన ఈ ఆర్టికల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. దయచేసి మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం మన పేజిని ఫాలో అవ్వండి.

Related Posts --

Top 10 Health Benefits of Castor Oil and Beauty benefits and Importance
గోరింటాకు ఎర్రగా పండటానికి తెలుగు చిట్కాలు మరియు గోరింటాకు వల్ల ఉపయోగాలు
How to Make Onion Juice for Hair Growth and Dandruff Remove and its Benefits
శనగపిండి ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి. శనగపిండి ప్రయోజనాలు
ఏ ఆహారంలో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. విటమిన్ B12 లోపం వల్ల వచ్చే సమస్యలు