సిల్కీ అండ్ బౌన్సీ హెయిర్ కోసం మందారం, మందారంతో ఇలా చేస్తే వెంట్రుకలు వేగంగా పెరుగుతాయి, మందారం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు,
జుట్టు పొడవుగా మరియు వేగంగా పెరిగేలా చేయడం ఎలా, మందారం నూనెను ఎలా తయారు చేయాలి
వెంట్రుకల పెరుగుదలకు మందారాన్ని ఎలా ఉపయోగించాలి
భారతదేశంలో దాదాపు ప్రతి ఒక్క ఇంటిలో మందారం చెట్టు ఉంటుంది. మందారం చెట్టు అనేక రకాలుగా ఉంటుంది. కొన్ని చెట్లకి యెర్రని పూలు పూస్తే మరికొన్నింటికి ముదురు రంగు పూలు పూస్తాయి. అలాగే వాటి రెక్కలు కూడా వేరుగా ఉంటాయి. కాని జుట్టు పెరుగుదలకు ప్రతి ఒక్క మందరం పూలు కూడా ఒకేరకమైన ప్రయోజనాలను కలిగిస్తాయి. మందారం పూలను కడికి, మిక్సీ లో వేసి మెత్తగా ఆడించి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ ని తలకి పట్టిస్తే జుట్టు వేగంగా పెరుగుతుంది. చుండ్రు సమస్యలు దూరం అవుతాయి.
Hibiscus benefits for Hair మందారంతో జుట్టుకి కలిగే ప్రయోజనాలు
Hibiscus oil మందారం నూనెను ఎలా తయారు చేయాలి ?
కావలసినవి:
ఈ నూనెని వారానికి కనీసం 2 సార్లు పెట్టుకోవడం వల్ల నిర్జీవంగా మారిన వెంట్రుకలు సైతం నల్లగా ఒత్తుగా మారుతాయి.
జుట్టు పెరుగుదలకు వేప మరియు మందారం
కావలసినవి:
ఇలా చేయడం వల్ల వేప చుండ్రుని దూరం చేస్తుంది. మందారం వేపతో కలిసినప్పుడు జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
జుట్టు పెరుగుదలకు కలబంద, పెరుగు మరియు మందారం
కావలసినవి:
పెరుగు తలని చల్లబరుస్తుంది, అలాగే తలలో నుంచి వచ్చే దుర్వాసనని తొలగిస్తుంది. కలబందలో ఉండే యాంటీ ఫంగల్ స్కాల్ప్‌లోని బ్యాక్టీరియాను తొలగిస్తుంది. మందారం కుదుళ్ళని గట్టి పరచి జుట్టు ఒత్తుగా వేగంగా పెరిగేలా చేస్తుంది.
జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ మరియు మందారం
కావలసినవి:
ఈ పద్ధతిని మీరు వారానికి 2 సార్లు పాటించవచ్చు. దీనివల్ల ఊడిపోయిన జుట్టు మళ్ళీ తిరిగి వస్తుంది. అంతేకాదు జుట్టు ఊడటం ఆగిపోతుంది. తెల్లని వెంట్రుకలు నల్లగా మారుతాయి.
జుట్టు పెరుగుదలకు (మెహందీ) గోరింటాకు మరియు మందారం
కావలసినవి:
గోరింటాకు సహజంగా తెల్లని వెంట్రుకలను ముదురు ఎరుపు రంగులోకి మారుస్తుంది. అలాగే తలలో తేమ శాతాన్ని పెంచి జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది. నిమ్మరసం తలలో రక్త ప్రసరణని పెంచి జుట్టు ఎదుగుదలకి సహాయపడుతుంది.
ఈ ఆర్టికల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. పైన చెప్పిన విధంగా చేస్తే మీ జుట్టు చాలా ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది.

- మందిరంలో అధికంగా విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అవి తెగిన మీ జుట్టుని తిరిగి పెంచేందుకు తోడ్పడతాయి. దీంతో జుట్టు దృఢంగా మారుతుంది.
- మందారం నూనెలో అధికంగా విటమిన్ సి ఉంటుంది. ఇది మీ జుట్టుని నల్లగా మెరిసే లాగ తయారుచేస్తుంది.
- కాలుష్యం ప్యారగడంతో ప్రతి ఒక్కరూ చుండ్రు సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్లు మందారం నూనెని అలాగే మందరం పువ్వుల పేస్ట్ ని ఉపయోగిస్తే చాలా త్వరగా చుండ్రు నుంచి ఉపశమనం పొందుతారు.
- మందరంని రెగ్యులర్ గా వాడటం వల్ల తెల్లని వెంట్రుకలను నల్లగా మార్చుకోవచ్చు.
కావలసినవి:
- 15 మందారం ఆకులు
- 20 మందారం పువ్వులు
- 250ml స్వచ్ఛమైన కొబ్బరి నూనె
- మందార ఆకులను, పువ్వులను మిక్సీలో వేసి మేహని ముద్దలాగా చేయాలి.
- ఒక పాత్రలో కొబ్బరి నూనె, మందారం పాస్టని వేసి తక్కువ మంట మీద పెట్టి వేడి చేయాలి.
- 10 - 15 నిమిషాల తరువాత నూనె ఎర్రగా మారుతుంది అప్పుడు కిందకి దించి నూనెని చల్లబరచాలి.
- ఇలా చల్లబరచిన నూనెని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఈ నూనెని వారానికి కనీసం 2 సార్లు పెట్టుకోవడం వల్ల నిర్జీవంగా మారిన వెంట్రుకలు సైతం నల్లగా ఒత్తుగా మారుతాయి.
జుట్టు పెరుగుదలకు వేప మరియు మందారం
కావలసినవి:
- 15 మందారం ఆకులు
- 20 మందారం పువ్వులు
- వేప ఆకులు
- ముందుగా మందారం ఆకులను, పువ్వులను బాగా కడిగి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ తయారుచేసుకోవాలి.
- అదేవిధంగా వేప ఆకులకి కొన్ని నీరు కలిపి మెత్తని పేస్ట్ గా చేయాలి. అలా చేసిన పేస్ట్ నుంచి రసాన్ని బయటికి తీయాలి.
- ఈ రసాన్ని మందారం పేస్ట్ కి కలిపి తలా వెంట్రుకలకి అలాగే చర్మానికి అప్లై చేసుకోవచ్చు.
- ఒక 30 నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.
ఇలా చేయడం వల్ల వేప చుండ్రుని దూరం చేస్తుంది. మందారం వేపతో కలిసినప్పుడు జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
జుట్టు పెరుగుదలకు కలబంద, పెరుగు మరియు మందారం
కావలసినవి:
- 10 మందారం ఆకులు
- 10 మందారం పువ్వులు
- 5 స్పూన్లు కలబంద
- 3 స్పూన్లు పెరుగు
- మందారం ఆకులను, పువ్వులను బాగా కడిగి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ తయారుచేసుకోవాలి.
- తరువాత పెరుగు మరియు కలబంద రెండింటిని మందారం పేస్ట్ తో కలపాలి.
- ఈ మిశ్రమాన్ని వెంట్రుకల కుదుళ్ళకి పట్టించాలి.
- ఒక 30 నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.
పెరుగు తలని చల్లబరుస్తుంది, అలాగే తలలో నుంచి వచ్చే దుర్వాసనని తొలగిస్తుంది. కలబందలో ఉండే యాంటీ ఫంగల్ స్కాల్ప్‌లోని బ్యాక్టీరియాను తొలగిస్తుంది. మందారం కుదుళ్ళని గట్టి పరచి జుట్టు ఒత్తుగా వేగంగా పెరిగేలా చేస్తుంది.
జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ మరియు మందారం
కావలసినవి:
- 10 మందారం ఆకులు
- 10 మందారం పువ్వులు
- 5 స్పూన్లు ఉల్లిపాయ రసం
- మందారం ఆకులను, పువ్వులను బాగా కడిగి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ తయారుచేసుకోవాలి.
- తరువాత ఉల్లిపాయ రసంని మందారం పేస్ట్ తో కలపాలి.
- ఈ మిశ్రమాన్ని వెంట్రుకల కుదుళ్ళకి పట్టించాలి.
- 20 - 25 నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.
ఈ పద్ధతిని మీరు వారానికి 2 సార్లు పాటించవచ్చు. దీనివల్ల ఊడిపోయిన జుట్టు మళ్ళీ తిరిగి వస్తుంది. అంతేకాదు జుట్టు ఊడటం ఆగిపోతుంది. తెల్లని వెంట్రుకలు నల్లగా మారుతాయి.
జుట్టు పెరుగుదలకు (మెహందీ) గోరింటాకు మరియు మందారం
కావలసినవి:
- 10 మందారం ఆకులు
- 10 మందారం పువ్వులు
- గోరింటాకు
- 3 స్పూన్లు నిమ్మ రసం
- పెరుగు
- గోరింటాకు, మందారం ఆకులను మరియు పువ్వులను బాగా కడిగి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ తయారుచేసుకోవాలి.
- తరువాత నిమ్మ రసం మరియు పెరుగుని మందారం పేస్ట్ తో కలపాలి.