Top 10 Health Benefits of Castor Oil and Beauty benefits and Importance. And what disease can be cured with castor oil.

ఆముదం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు, ఆముదంతో ఎలాంటి జబ్బులను నయం చేయవచ్చు, ఆముదం వల్ల కలిగే సౌందర్య ప్రయోజనాలు, ఆముదం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఆముదం యొక్క ప్రాముఖ్యత.

ఆముదంతో అనేకప్రయోజనాలు వున్నాయి. ఆముదం వాడటం వల్ల ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి మరియు వెంట్రుకలకి అనేక ఉపయోగాలు కలవు. మన పూర్వీకులు వంటకాలలో కూడా ఈ ఆముదముని ఉపయోగించేవారు. అంతేకాదు చాలా రకాల ఆరోగ్య సమస్యలకి మరియు జుట్టు పెరుగుదలకు ఆముదముని ఉపయోగించేవారు.

ఆముదం తలకు రాయడం వల్ల చర్మ సమస్యలు దూరమవుతాయి. వెంట్రుకలు విరిగిపోకుండా కుదుళ్ళు గట్టిగా ఉండేందుకు సహాయపడుతుంది. పూర్వం దక్షిణ భారతదేశంలో అందరు ఆముదంని తలకి రాసుకునేవాళ్ళు. అందువల్లనే వారి వెంటుకలు చాలా కాలం వరకు కూడా తెల్లబడేవి కాదు. ఆముదంని కేవలం తలకి మాత్రమే కాకుండా వంటకాలలో కూడా ఉపయోగించేవాళ్ళు.

ఆముదం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు

ఆముదం వాడటంతో మనం కుష్ఠు వ్యాధి, గెండె సంబంధిత జబ్బులు, చర్మ సంబంధిత రోగాలు, నులి పురుగులను నాశనం చేయవచ్చు. ముఖ్యంగా వాతరోగాలను పోగొట్టడంలో ఆముదంది అగ్రస్థానం. శరీరంలో పేరుకుపోయిన విషతుల్యాలను బయటకు పంపడంలో బాగా పనిచేస్తుంది. ఆముదం తలకు రాయడం వల్ల వెంట్రుకలు విరిగిపోకుండా కుదుళ్ళు గట్టిగా ఉండేందుకు సహాయపడుతుంది.

1. ఆముదం పచ్చకామెర్లును నయం చేస్తుంది

పచ్చకామెర్లతో బాధపడుతున్న వాళ్ళు ఆముదం ఆకులను వాడటం వల్ల కామెర్లను నయం చేయవచ్చు. ఆముదపు ఆకుల నుంచి రసాన్ని తీసి, ఆ రసాన్ని రోజుకి రెండు పూటలా 3 టేబుల్ స్పూన్లు తాగడం వల్ల కామెర్లను నయం చేయవచ్చు.

2. ఆముదం చెవిపోటుని నయం చేస్తుంది

మీకు ఎప్పుడైనా చెవిపోటు వచ్చింది అంటే అప్పుడు ఆముదం ఆకుల రసాన్ని వాడటం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆముదపు ఆకులు రసంకి అల్లం రసం, ఉప్పు, నువ్వుల నూనె కలిపి సన్నని మంటపై మరిగించి వడపోయాలి. ఈ తైలాన్ని ఏ చెవిలో అయితే పోటు ఉందో ఆ చెవిలో 2 3 చుక్కలు వేసినట్లయితే చెవిపోటు తగ్గిపోతుంది.

3. ఆముదంతో మచ్చలను దూరం చేయవచ్చు

ఆముదపు గింజలు మరియు శొంఠి కలిపి మెత్తగా నూరి, వాటిని చిన్న చిన్న ముద్దలుగా తయారుచేసి, రెండు నెలలు పాటు ఉదయం సాయంత్రం ఒక్కొక్కటి చొప్పున తీసుకుంటే శరీరంపై నల్లటి మచ్చలు తొలగిపోతాయట. మరియు కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.

4. ఆముదంతో దగ్గు నుంచి ఉపశమనం

ఆముదం వేసి తయారు చేసిన చామదుంపల కూర తింటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

5. మూత్రపిండాలలో వున్నా రాళ్లను కరిగిస్తుంది

ప్రతిరోజు రాత్రి పడుకునే సమయంలో టేబుల్ స్పూన్ల ఆముదం తాగితే కొన్ని రోజులలో మూత్ర కోశంలో వున్న చిన్న చిన్న రాళ్ళూ కరిగిపోతాయి.

6. ఆముదం కీళ్ల నొప్పులను నివారిస్తుంది

ఆముదంలో కొంచెం కొబ్బరి నూనెను కలిపి రాత్రి వేళలో అరికాళ్ళ పూసి మర్దనా చేయడం ద్వార కీళ్ల నొప్పులు తగ్గుతాయి అలాగే శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

7. ఆముదంతో రేచీకటి తగ్గిపోతుంది

చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్లు క్రమం తప్పకుండా తలకి ఆముదం పెట్టడం ద్వారా రేచీకటి మరియు ఇతర కంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.

8. ఆముదం జుట్టుని వేగంగా పెంచుతుంది మరియు చుండ్రుని శాశ్వతంగా తగ్గిస్తుంది

ఆముదము ఉపయోగించడం వల్ల పూర్వం దక్షిణ భారతదేశంలో అందరికీ జుట్టు ఒత్తుగా ఉండేది మరియు వాళ్ల జుట్టు అంత తొందరగా తెల్లబడేది కాదు. ఆముదం ఉపయోగించడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది మరియు చుండ్రుని శాశ్వతంగా దూరం చేస్తుంది. వారంలో కనీసం 2 సార్లు ఆముదాన్ని జుట్టుకు రాయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

9. ఆముదం ఉపయోగించడం వల్ల గుండె జబ్బులు రావు

వారానికి సార్లు ఆముదం వేసి తయారుచేసిన వంటలను తినడం ద్వారా గుండెకు సంబంధించిన సమస్యలను రాకుండా చూడవచ్చు మరియు బోదకాలుకి ఒక చక్కటి పరిష్కారంగా ఆముదముని చెప్పుకోవచ్చు.

10. జిడ్డుని తొలగిస్తుంది

ఆముదముని తలకి పెట్టుకోవడం ద్వారా అది మన చర్మం పైన వున్న చెడ్డ బాక్టీరియాని తొలగిస్తుంది. ఎప్పుడు అయితే ఆ చెడ్డ బాక్టీరియా తొలగిపోతుందో అప్పుడు జిడ్డు ఉత్పత్తి అనేది తగ్గిపోయి చర్మం అందంగ కనబడుతుంది.

మేము రాసిన ఈ ఆర్టికల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. దయచేసి మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం మన పేజిని ఫాలో అవ్వండి.

Related Posts --