నల్లని మరియు ప్రకాశవంతమైన జుట్టు పొందడానికి 5 తెలుగు చిట్కాలు, జుట్టు నల్లగా మరియు సిల్కీగా పొందడానికి ఏమి చేయాలి, నల్లని మరియు సిల్కీ జుట్టును ఎలా పొందాలి, జుట్టు యొక్క ప్రయోజనాలు, జుట్టు పొడవుగా పెరగడానికి తెలుగు చిట్కాలు
తెలుగు చిట్కాలు Telugu Chitkaalu
మీరు ఎన్నేన్నో షాంపులను మరియు రకరకాల నూనెలు వాడినా కూడా జుట్టు పెరుగుదలలో ఎలాంటి మార్పు కనిపించడం లేదా. ఎవరు అయితే నల్లని మరియు పొడవైన జుట్టు కావాలని కోరుకుంటున్నారో వారికోసం కొన్ని తెలుగు చిట్కాలను అందిస్తున్నాము. అన్ని తెలుగు చిట్కాల గురించి తెలుసుకోవడానికి ఈ వ్యాసాన్ని చివరి వరకు చదవండి.
జుట్టు యొక్క ప్రయోజనాలు
జుట్టు పెరగడం వల్ల అనేక ప్రయోజనాలు కలవు
జుట్టు నల్లగా మరియు సిల్కీగా పొందడానికి ఏమి చేయాలి
పొడవైన మరియు ప్రకాశవంతమైన జుట్టు పొందడానికి తెలుగు చిట్కాలు
1. జుట్టు పెరుగుదలకి కోడిగుడ్డు మరియు ఆముదం
కోడి గుడ్డులోని తెల్లని భాగానికి ఆముదం కలిపి మిశ్రమలాగా చేసి జుట్టుకి రాయడం వల్ల జుట్టులో తేమ శాతం పెరిగి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఆముదం జుట్టు నల్లగా మారేందుకు సహాయపడుతుంది గుడ్డు జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది.
కావాల్సిన పదార్థాలు:
ఉపయోగించు విధానం:
2. జుట్టు పెరుగుదలకి ఉల్లిపాయ రసం
ఉల్లిపాయ తలలో చుండ్రుని తొలగిస్తుంది మరియు బాక్టీరియాని దూరం చేస్తుంది. దీనివల్ల జుట్టు పెరుగుదలలో మార్పులు వచ్చి జుట్టు చాలా వేగంగా పెరుగుతుంది.
కావాల్సిన పదార్థాలు:
ఉపయోగించు విధానం:
3. జుట్టు పెరుగుదలకి కలబంద గుజ్జు
కలబంద తలలో వచ్చే చుండ్రు సమస్యలతో పోరాడి తలని శుభ్రం చేస్తుంది. ఆముదం జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
కావలసినవి:
ఉపయోగించు విధానం:
4. జుట్టు పెరుగుదలకు వేప మరియు మందారం
ఇలా చేయడం వల్ల వేప చుండ్రుని దూరం చేస్తుంది. మందారం వేపతో కలిసినప్పుడు జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
కావలసినవి:
తయారుచేయు విధానం:
5. జుట్టు పెరుగుదలకు పెరుగు
పెరుగు తలని చల్లబరుస్తుంది, అలాగే తలలో నుంచి వచ్చే దుర్వాసనని తొలగిస్తుంది. కలబందలో ఉండే యాంటీ ఫంగల్ స్కాల్ప్‌లోని బ్యాక్టీరియాను తొలగిస్తుంది. మందారం కుదుళ్ళని గట్టి పరచి జుట్టు ఒత్తుగా వేగంగా పెరిగేలా చేస్తుంది.
కావలసినవి:
తయారుచేయు విధానం:
ఈ ఆర్టికల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. పైన చెప్పిన విధంగా చేస్తే మీ జుట్టు చాలా ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది.

- జుట్టు సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు నేరుగా తలని తాకకుండా ఆపుతుంది.
- ఎవరైనా సరే అందంగా కనిపించాలి అంటే జుట్టు అనేది చాలా అవసరం.
- జుట్టు పెరగడం వల్ల తలలో తేమ శాతం తగ్గదు అందువల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
- జుట్టుకి నూనె రాయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
జుట్టు నల్లగా మరియు సిల్కీగా పొందడానికి ఏమి చేయాలి
- వారానికి 2 లేదా 3 సార్లు తలకి నూనె రాసుకోవాలి.
- శరీరంలో నీటి శాతాన్ని మెరుగుపరచుకోవాలి.
- ప్రతిరోజు 6, 7 గంటలపాటు నిద్రపోవాలి.
- 2 రోజులకు ఒకసారి సహజంగా లభించే కుంకుడుకాయ మరియు సీకాయపొడిని ఉపయోగించి తల స్నానం చేయాలి.
- ఆకుకూరలను మరియు మార్కెట్లో లభించే పండ్లను శుభ్రం చేసుకుని తినాలి.
- వారానికి 3 సార్లు గుడ్లు, పాలు, మాంసం తినాలి.
- సమయం దొరికినప్పుడు వ్యాయామం, యోగా చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు వేగంగా పెరుగుతుంది.
- అప్పుడప్పుడు కలబంద, గోరింటాకు, మెంతులను ఉపయోగించి తలకు పట్టించాలి.
పొడవైన మరియు ప్రకాశవంతమైన జుట్టు పొందడానికి తెలుగు చిట్కాలు
1. జుట్టు పెరుగుదలకి కోడిగుడ్డు మరియు ఆముదం
కోడి గుడ్డులోని తెల్లని భాగానికి ఆముదం కలిపి మిశ్రమలాగా చేసి జుట్టుకి రాయడం వల్ల జుట్టులో తేమ శాతం పెరిగి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఆముదం జుట్టు నల్లగా మారేందుకు సహాయపడుతుంది గుడ్డు జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది.
కావాల్సిన పదార్థాలు:
- ఆముదం 4 టీస్పూన్లు
- గుడ్డులోని తెల్లని సోన
ఉపయోగించు విధానం:
- ఆముదం మరియు గుడ్డులోని తెల్లని సోనని ఒక గిన్నెలో వేసి బాగా మిశ్రమంలాగా తయారుచేయాలి.
- దీనిని తల భాగానికి రాయాలి.
- ఒక అరగంట తరువాత చల్లటి నీటితో స్నానం చేయాలి.
2. జుట్టు పెరుగుదలకి ఉల్లిపాయ రసం
ఉల్లిపాయ తలలో చుండ్రుని తొలగిస్తుంది మరియు బాక్టీరియాని దూరం చేస్తుంది. దీనివల్ల జుట్టు పెరుగుదలలో మార్పులు వచ్చి జుట్టు చాలా వేగంగా పెరుగుతుంది.
కావాల్సిన పదార్థాలు:
- ఉల్లిపాయ రసం 3 టీస్పూన్లు
ఉపయోగించు విధానం:
- ఉల్లిపాయ రసం ఒక గిన్నెలో వేసి బాగా మిశ్రమంలాగా తయారుచేయాలి.
- ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత వెంట్రుకల యొక్క కుదుళ్లకి పట్టించాలి.
- 20 నిమిషాల తరువాత ఈ మిశ్రమాన్ని మీ తల నుండి తొలగించుటకు గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.
3. జుట్టు పెరుగుదలకి కలబంద గుజ్జు
కలబంద తలలో వచ్చే చుండ్రు సమస్యలతో పోరాడి తలని శుభ్రం చేస్తుంది. ఆముదం జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
కావలసినవి:
- అర కప్పు కలబంద గుజ్జు
- 4 స్పూన్ల కాస్టర్ ఆయిల్ ( ఆముదం )
ఉపయోగించు విధానం:
- ఆముదం, కలబంద గుజ్జుని ఒక గిన్నెలో వేసి బాగా మిశ్రమం అయ్యే వరకు కలపండి.
- ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళకి అప్లై చేసి బాగా మసాజ్ చేయండి.
- ఒక గంట తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయండి.
4. జుట్టు పెరుగుదలకు వేప మరియు మందారం
ఇలా చేయడం వల్ల వేప చుండ్రుని దూరం చేస్తుంది. మందారం వేపతో కలిసినప్పుడు జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
కావలసినవి:
- 15 మందారం ఆకులు
- 20 మందారం పువ్వులు
- వేప ఆకులు
తయారుచేయు విధానం:
- ముందుగా మందారం ఆకులను, పువ్వులను బాగా కడిగి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ తయారుచేసుకోవాలి.
- అదేవిధంగా వేప ఆకులకి కొన్ని నీరు కలిపి మెత్తని పేస్ట్ గా చేయాలి. అలా చేసిన పేస్ట్ నుంచి రసాన్ని బయటికి తీయాలి.
- ఈ రసాన్ని మందారం పేస్ట్ కి కలిపి తలా వెంట్రుకలకి అలాగే చర్మానికి అప్లై చేసుకోవచ్చు.
- ఒక 30 నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.
5. జుట్టు పెరుగుదలకు పెరుగు
పెరుగు తలని చల్లబరుస్తుంది, అలాగే తలలో నుంచి వచ్చే దుర్వాసనని తొలగిస్తుంది. కలబందలో ఉండే యాంటీ ఫంగల్ స్కాల్ప్‌లోని బ్యాక్టీరియాను తొలగిస్తుంది. మందారం కుదుళ్ళని గట్టి పరచి జుట్టు ఒత్తుగా వేగంగా పెరిగేలా చేస్తుంది.
కావలసినవి:
- 10 మందారం ఆకులు
- 10 మందారం పువ్వులు
- 5 స్పూన్లు కలబంద
- 3 స్పూన్లు పెరుగు
తయారుచేయు విధానం:
- మందారం ఆకులను, పువ్వులను బాగా కడిగి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ తయారుచేసుకోవాలి.
- తరువాత పెరుగు మరియు కలబంద రెండింటిని మందారం పేస్ట్ తో కలపాలి.
- ఈ మిశ్రమాన్ని వెంట్రుకల కుదుళ్ళకి పట్టించాలి.
- ఒక 30 నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.
ఈ ఆర్టికల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. పైన చెప్పిన విధంగా చేస్తే మీ జుట్టు చాలా ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది.