What is rice water, How to make rice water for hair growth, How to use rice water for hair growth

జుట్టు పెరుగుదలకు రైస్ వాటర్, బియ్యం నీరు అంటే ఏమిటీ, జుట్టు పెరుగుదలకు బియ్యం నీళ్లని ఎలా తయారుచేయాలి, బియ్యం నీళ్ళని జుట్టు పెరుగుదలకు ఏలా ఉపయోగించాలి, బియ్యం నీటి ప్రయోజనాలు, బియ్యం నీళ్లు జుట్టు పెరుగుదలకి సహాయపడతాయా, రైస్ వాటర్ ప్రయోజనాలు

Rice water for hair growth :

ప్రతి ఒక్కరు తమ జుట్టు పొడవుగా పెరిగి బాగా ప్రకాశవంతంగా ఉండి అందరిని ఆకర్షించాలి అని కోరుకుంటారు. అందులో మగ వారి కంటే ఆడవారు తమ జుట్టు పొడవుగా నల్లగా వుండాలని కోరుకుంటారు.అందుకోసం ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేస్తారు, కానీ ఎలాంటి ప్రయోజనాలను పొందలేరు. అలాంటి వారికోసం బియ్యం నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలు బియ్యం నీరు అంటే ఏమిటీ ? ఎలా తయారు చేస్తారు?

బియ్యం నీళ్లని ఎలా తయారుచేయాలి

బియ్యం నీళ్లని తయారు చెయ్యడం చాలా సులభం, జుట్టు పెరుగుదలకి ఒక గాజు బియ్యం నీళ్ళు సరిపోతాయి. మనం ఈ నీళ్లని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. అందుకోసం మనం కొన్ని బియ్యం తీసుకోవాలి.మనం మాములుగా ఇంట్లో అన్నం వండుతుంటాము అందుకోసం మొదటగా బియ్యాన్ని నీటిలో వేసి నానబెట్టుతాము. అప్పుడు ఆ నీరు అనేది తెల్లగా మారుతుంది, ఈనీటిలో జుట్టుకి, చర్మానికి ఉపయోగపడే విటమిన్లు వుంటాయి.ఈ నీటినే బియ్యం నీరు అంటారు. ఈ నీరుని జుట్టుకి రాయడం వల్ల జుట్టు నల్లగా, మృదువుగా, పొడవుగా తయారవుతుంది.

బియ్యం నీటి ప్రయోజనాలు

  • బియ్యం నీరు జుట్టు బలంగా పొడవుగా పెరిగేందుకు సహాయపడుతాయి.
  • నీటిలో ఉన్న విటమిన్లు జుట్టుని తేమగా ఉంచి జుట్టు నిర్జీవంగా మారకుండా తోడ్పడుతుంది.
  • బియ్యం నీటిలో ఉన్న ఇనోసిటాల్ చిట్లిన జుట్టుకి రిపేర్ చేస్తుంది.
  • తలలో ఉన్న చుండ్రు సమస్యలను దూరం చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది.
  • మరియు ముఖ్యంగా మంచి కండీషనర్ గా పనిచేస్తుంది.

బియ్యం నీళ్లు జుట్టు పెరుగుదలకి సహాయపడతాయా?

బియ్యం నీటిలో ఉన్న పోషక విలువలు జుట్టు ఎదుగుదలకి సహాయపడుతాయా అంటే ఖచ్చితంగా అవును అనే చెప్పాలి. ఎందుకంటే అది నిజంగా నిరూపితం అయ్యింది కాబట్టి. చైనాలో "హువాన్గ్లు" అనే గ్రామంలో వున్న ప్రతిఒక్క మహిళ జుట్టు చాలా పొడవుగా ఉంటుంది.ఆ ఊరి మహిళలు జుట్టు ఎక్కువ పొడవుగా వున్న మహిళలుగా గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు సాధించారు. వారి జుట్టు ఎక్కువ పొడవుగా ఉండటానికి గల కారణం బియ్యం నీరుని జుట్టుకి పట్టించడమే అని చెప్పారు. దీనిని బట్టి చూస్తే బియ్యం నీరు జుట్టు పెరగడానికి సహాయపడుతుంది అని తెలుస్తోంది.

బియ్యం నీళ్ళని జుట్టు పెరుగుదలకు ఏలా ఉపయోగించాలి

  • బియ్యాన్ని నీటిలో నానబెట్టి కొద్దిసేపు కలియబెట్టి కాసేపు వదిలేయాలి.
  • తరువాత ఆ నీటిని వేరొక గిన్నెలోకి వడపోయాలి.
  • అలా వడపోసిన నీటిని కొద్ది కొద్దిగా తీసుకుని జుట్టుకు పట్టించాలి.
  • వీలైతే మీరు బియ్యం నీటికి కొంచెం లావెండర్ కలిపి అప్లై చేయవచ్చు.
  • ఒక 20 నుంచి 30 నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.
  • ఈ విధంగా వారానికి కనీసం 2 సార్లు చేయడం వల్ల చాలా తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.

ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్ళకి బలం వస్తుంది మరియు జుట్టు నల్లగా పొడవుగా పెరుగుతుంది. చాలామంది పేలు సమస్య నుంచి బాధపడుతుంటారు. అలాంటి వాళ్లు బియ్యం నీరుని జుట్టుకి రాయడం వల్ల ఉపశమనం పొందగలరు. ముఖ్యంగా బియ్యం నీటిని హెయిర్ కండిషనర్ గ ఉపయోగించవచ్చు.

మేము రాసిన ఈ వ్యాసం ఈకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.