What kind of food should be taken for hair growth, Rules and methods to follow for hair growth, What are the main causes of hair loss

జుట్టు పెరుగుదలకు పాటించవలసిన నియమాలు మరియు పద్ధతులు, జుట్టు పెరుగుదలకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, జుట్టు పెరుగుదలకు తినకూడని ఆహార పదార్థాలు, జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణాలు ఏవి, జుట్టుపెరుగుదలకు ఎటువంటి హెయిర్ ఆయిల్ ఉపయోగించాలి, మగవారిలో జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణాలు

జుట్టు పెరుగుదలకు తెలుగు చిట్కాలు :

ప్రతి ఒక్కరు తమ జుట్టు పొడవుగా, సున్నితంగా, నల్లగా ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటారు, కాని సరైన పద్దతులను పాటించకపోవడం వల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వ్యాసంలో మీకు జుట్టు పెరుగుదలకు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్ల గురించి వివరిస్తాము. వ్యాసాన్ని చివరి వరకు చదవండి.

జుట్టు పెరుగుదలకు పాటించవలసిన నియమాలు మరియు పద్ధతులు

  • జుట్టు వేగంగా మరియు ఒత్తుగా పెరిగేందుకు వారానికి రెండు లేదా మూడు సార్లు తలకి నూనె రాసుకోవాలి.
  • కేవలం సహజంగా లభించే కుంకుడుకాయ, సీకాయతో తల స్నానం చేయడం ఉత్తమం.
  • ఇలా చేస్తే చుండ్రు సమస్యలు అనేవి మీ నుంచి శాశ్వతంగా దూరం అవుతాయి.
  • ప్రతి రోజు 6 నుంచి 7 గంటల నిద్ర తప్పనిసరి.
  • మద్యపానం మరియు ధూమపానం చేయడం ఆపివేయాలి.
  • కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో టోపీని ఉపయోగించాలి.
  • తల స్నానం చేసిన తరువాత తడిగా వున్నపుడు తలని దువ్వరాదు.
  • వేడి నీటితో తల స్నానం చేయరాదు.

జుట్టు పెరుగుదలకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి

సాధారణంగా జుట్టు పెరుగుదలకు విటమిన్ ఆ, బి, సి మరియు ప్రొటీన్స్ అనేవి చాలా అవసరం. ఎవరి శరీరంలో అయితే ఈ ప్రోటీన్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయో వారి జుట్టు అనేది ధృడంగా మరియు ప్రకాశవంతంగా ఉంటుంది. అందుకోసం మన ఆహారపు అలవాట్లలో ఎక్కువ ప్రోటీన్ మరియు విటమిన్లు ఉండేలా చూడాలి.

కింది ఆహరం తీసుకోవడం వల్ల మనం మన జుట్టుని ఆరోగ్యగా ఉంచుకోవచ్చు

  • ప్రతి రోజు కనీసం 3 నుంచి 4 లీటర్ల మంచి నీరు తాగాలి.
  • ఆకుకూరలు మరియు కూరగాయలను తినాలి.
  • Dry Fruits అయిన ఎండు ద్రాక్ష, ఖర్జూరం, బాదం మరియు పిస్తా వంటి ఎక్కువ ప్రోటీన్స్ వున్న వాటిని తినాలి.
  • మార్కెట్లో లభించే పండ్లను శుభ్రం చేసుకుని తినాలి, అందులో ముఖ్యంగా బత్తాయి, దానిమ్మ, చీని, ద్రాక్ష మరియు ఆపిల్ తినాలి.
  • అలాగే వీలైనంతగా మాంసాహారం చేపలు, గ్రుడ్లు కూడా తినాలి.
  • ఆవు పాలలో కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడే పోషక విలువలు ఉన్నాయి, అందువల్ల ఆవు పాలు తాగడం మంచిది.

జుట్టు పెరుగుదలకు తినకూడని ఆహార పదార్థాలు

జుట్టు పెరుగుదలకు మంచి ఆహారపు అలవాట్లను కలిగి ఉండటం ఎంత ముఖ్యమో అలాగే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం అంతే ముఖ్యం. వాటిలో ముఖ్యమైనవి క్రింద వివరించబడ్డాయి.

  • ఎక్కువగా తీపు తినకూడదు.
  • మద్యపానం మరియు ధూమపానం చేయరాదు.
  • మసాలా ఎక్కువగా Fast Food వున్న తినకూడదు.
  • అధికంగా నూనె వస్తువులను తినకూడదు.

మగవారిలో జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణాలు

  • అధికంగా ఆలోచించడం మరియు ఒత్తిడికి లోనవడం.
  • సరైన నిద్ర మరియు ఆహారం లేకపోవడం.
  • వంశ పారంపర్య వల్ల జుట్టు త్వరగా ఊడిపోతుంది.
  • వయస్సు పెరగటం మరియు హార్మోన్లు బాలన్స్ తప్పడం వల్ల.
  • కాలుష్యం వల్ల మరియు తల మీద బరువులు మోయడం వల్ల కూడా జుట్టు పెరుగుల ఈడ ప్రభావం చూపిస్తుంది.

జుట్టుపెరుగుదలకు ఎటువంటి హెయిర్ ఆయిల్ (Hair Oil) ఉపయోగించాలి

  1. ఆముదం Castor Oil
  2. కొబ్బరి నూనె
  3. ఉల్లిపాయ రసం
  4. వేప నూనె
  5. మందారం నూనె
  6. కలబంద
  7. గోరింటాకు

పైన చెప్పిన హెయిర్ ఆయిల్ ను వారానికి కనీసం 2, 3 సార్లు ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు పొందగలరు.

మేము రాసిన ఈ వ్యాసం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.