Benefits of Pumpkin Seeds for Health, How to eat Pumpkin Seeds for Health, How to Make Pumpkin Seeds

ఆరోగ్యం కోసం గుమ్మడి గింజల ప్రయోజనాలు, ఆరోగ్యం కోసం గుమ్మడి గింజలు ఎలా తినాలి, గుమ్మడి గింజలను ఎలా తయారు చేసుకోవాలి

Pumpkin Seeds for Health: గుమ్మడి కాయతో ఎన్నో రకాల వంటలు చేయవచ్చని మనందరికీ తెలుసు, కాని గుమ్మడి గింజలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మనలో చాలా మందికి తెలియదు. అందుకోసమే ఈ రోజు గుమ్మడి గింజలను ఏ విధంగా ఆరోగ్యం కోసం ఉపయోగించాలి అలాగే ఏ వ్యాధులకు గుమ్మడి గింజలు చక్కని పరిష్కారంగా వున్నాయో తెలుసుకుందాం.

గుమ్మడి పెరటిలో సులభంగా పెంచుకోవచ్చు. గుమ్మడి గింజలలో అధికంగా ప్రోటీన్ లభిస్తుంది. గుమ్మడి గింజలు యొక్క గుణాలు కాన్సర్ తో పోరాడే శక్తిని ఇస్తుంది మరియు కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. గుమ్మడి విత్తనాలలో కాల్షియం, జింక్, పొటాషియం, ఐరన్ మరియు విటమిన్ A,B,K అధికంగా లభిస్తాయి. గుమ్మడి విత్తనాలు శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచి అనారోగ్యం కాకుండా చేస్తాయి. మొదలైన గుమ్మడి ప్రయోజనాలు కింద తెలుసుకుందాము.

ఆరోగ్యానికి గుమ్మడి విత్తనాల ప్రయోజనాలు

బలమైన ఎముకల కోసం గుమ్మడి విత్తనాలు

గుమ్మడి విత్తనాలలో వున్న ప్రోటీన్స్, ఐరన్ మరియు కాల్షియం పెళుసుబారిన ఎముకను బలంగా తయారు చేయడానికి ఉపయోగపడతాయి. అందువల్ల ఎప్పుడైనా కింద పడినప్పుడు ఎముకలు విరిగిపోకుండా దృడంగా ఉంటాయి. కసరత్తులు GYM చేసేవారికి గుమ్మడి విత్తనాలు ఉపయోగకరంగా ఉంటాయి.

గుండె ఆరోగ్యం కోసం గుమ్మడి విత్తనాలు

గుమ్మడి గింజలు శరీరంలో వున్న కొవ్వుని కరిగించి రక్తం శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. కొన్ని అధ్యయనాల ద్వారా నిరూపితం అయినది ఏంటంటే గుమ్మడి విత్తనాలు గుండె యొక్క ఆరోగ్యాన్నీ కాపాడుతాయి. చాలా మందికి డాక్టర్లు కూడా గుమ్మడి గింజలను తరచుగా తినమని సలహా ఇస్తుంటారు.

మూత్రాశయంలో రాళ్లను తొలగించుటకు

గుమ్మడి గింజలకు మూత్రాశయంలో వున్న రాళ్లను కరిగించే శక్తి వుంది. అంతేకాదు చాలా మంది మూత్రాన్ని ఆపుకోలేరు అటువంటి వాళ్ళు ప్రతి రోజు గుమ్మడి విత్తనాలను తినడం వల్ల ఆ సమస్య తీరిపోతుంది.

జీర్ణక్రియను మెరుగు పరచడానికి

మనం రోజూ తినే ఆహారంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు కడుపు నొప్పి రావడం అలాగే తిన్న ఆహారం జీర్ణం అవ్వకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అటువంటి సందర్భాలలో గుమ్మడి గింజలు తినడం వల్ల అందులో ఉన్న ఫైబర్ గుణాలు ఆహారం జీర్ణం అయ్యేలా చేసి ఒత్తిడిని మరియు మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

గుమ్మడి విత్తనాలలో ఉన్న గుణాలు ఆడవాళ్ళలో వచ్చే రొమ్ము కాన్సర్ రాకుండా చేస్తుంది.

రక్తాన్ని శుద్ధి చేయడానికి గుమ్మడి విత్తనాలు

ప్రతిరోజూ ఆహారంలో భాగంగా గుమ్మడి విత్తనాలను తీసుకోవడం వల్ల రక్తంలో హీమోగ్లోబిన్ పెరుగుతుంది. తద్వారా రక్తహీనత నుంచి బయట పడవచ్చు. మరియు చర్మం చాలా సున్నితంగా అందంగా కనబడటానికి గుమ్మడి విత్తనాలు సహాయపడతాయి.

గుమ్మడి గింజలను ఎలా తయారు చేసుకోవాలి

  • గుమ్మడి కాయ నుంచి గుమ్మడి గింజలను వేరు చేసి ఎండలో ఆరబెట్టుకోవాలి.

గుమ్మడి గింజలను ఎలా తయారు చేసుకోవాలి

  • గింజలు బాగా ఎండిన తరువాత మంట మీద వేయించి తినవచ్చు.
  • మనం చేసుకున్న ఆహారంతో పాటుగా కూడా తినవచ్చు.

స్వచ్ఛమైన గుమ్మడి గింజలు మార్కెట్లో కూడా దొరుకుతాయి, వాటిల్లో తాజాగా వున్న గుమ్మడి గింజలను మాత్రమె కొనండి.

ఈ వ్యాసం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.