Coconut oil for healthy hair, Benefits of Coconut Oil for Hair, How to use coconut oil for hair growth

ఆరోగ్యమైన జుట్టు కోసం కొబ్బరినూనె, జుట్టుకి కొబ్బరి నూనె ప్రయోజనాలు, జుట్టు పెరుగుదలకు కొబ్బరి నూనెను ఎలా ఉపయోగించాలి, ఒత్తైన జుట్టు కోసం కొబ్బరి నూనె

Coconut oil for healthy hair ఆరోగ్యమైన జుట్టు కోసం కొబ్బరినూనె

కొబ్బరి నూనె చర్మ సౌందర్యానికి కాకుండా జుట్టు సమస్యలకు ఒక చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె మన ఇంట్లోనే దొరికే సహజమైన హెయిర్ ఆయిల్. జుట్టు పెరగడానికి కావలసిన విటమిన్స్ మరియు ప్రోటీన్స్ కొబ్బరి నూనెలో పుష్కలంగా లభిస్తాయి. ఎలాంటి ఖర్చు లేకుండా మనం కొబ్బరి నూనెని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అలాంటి కొబ్బరినూనె వల్ల మన జుట్టుకి కలిగే ప్రయోజనాలు కింద వివరించాము.

జుట్టుకి కొబ్బరి నూనె ప్రయోజనాలు

  • జుట్టుకి కొబ్బరి నూనె రాయడం వల్ల పలుచబడ్డ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
  • కొబ్బరి నూనెకి వున్న యాంటీ బాక్టీరియల్ గుణం తలలోని చుండ్రుని దూరం చేస్తుంది.
  • ఇందులోని యాసిడ్స్ జుట్టు కోనలు చిట్లిపోకుండా కాపాడుతాయి.
  • తెల్లని జుట్టు దూరం చేయడంలో కూడా కొబ్బరినూనె ఎంతగానో సహాయపడుతుంది.

జుట్టు పెరుగుదలకు కొబ్బరి నూనెను ఎలా ఉపయోగించాలి

చక్కటి జుట్టు కోసం కొబ్బరి నూనె తలకు పట్టించి ఒక రాత్రి అంతా అలాగే ఉంచి మరుసటి రోజు తల స్నానం చేయడం వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాదు మనం కొబ్బరి నూనెకి అదనంగా కొన్ని పదార్థాలను కూడా ఉపయోగించి జుట్టుకి అప్లై చేయవచ్చును.

ఒత్తైన జుట్టు కోసం కొబ్బరి నూనె

కావలసినవి :

కలబంద
కొబ్బరినూనె

ఉపయోగించు విధానం :

  • కలబంద యొక్క ఒక ఆకుని తీసుకుని అందులో నుంచి గుజ్జుని బయటికి తీయాలి.
  • కలబంద గుజ్జుకి కొబ్బరినూనెని కలిపి బాగా మిశ్రమంలాగా తయారు చేయాలి.
  • ఈ మిశ్రమాన్ని తల భాగానికి మరియు జుట్టుకు పట్టించాలి.
  • ఒక 30 - 35 నిమిషాలు ఆగి చల్లటి నీటితో సహజమైన షాంపూని ఉపయోగించి తల స్నానం చేయాలి.

ఇలా చేయడం వల్ల కలబంద తలలోని చుండ్రుని తొలగనుంచి కుదుళ్ళని పటిష్టంగా చేస్తుంది. మరియు కొబ్బరినూనెలో వున్న విటమిన్లు జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయి.

కొబ్బరి నూనెని వారానికి ఎన్నిసార్లు జుట్టుకి రాసుకోవచ్చు?

కొబ్బరినూనెని వారానికి కనీసం 2 నుంచి 3 సార్లు జుట్టు రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుంది.

కొబ్బరి నూనె వాడటం వల్ల చర్మం నల్లగా మారుతుందా?

కొబ్బరి నూనెని వాడటం వల్ల చర్మం కేవలం సున్నితంగా మారుతుంది. నల్లగా మారడం జరగదు.

ఈ వ్యాసం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. ధన్యవాదములు.