How to use coconut oil for healthy skin, Benefits of Coconut Oil for Skin, Side Effects of Coconut Oil

ఆరోగ్యమైన చర్మానికి కొబ్బరి నూనె ఎలా ఉపయోగించాలి, చర్మానికి కొబ్బరి నూనె యొక్క ప్రయోజనాలు, మృదువైన చర్మం కోసం కొబ్బరి నూనె, కొబ్బరి నూనె దుష్ప్రభావాలు

కొబ్బరి తినడం వల్ల అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు కలవు. మనం మన పూర్వీకులను చూసినట్లైతే వారు శారీరకంగా చాలా బలంగా మరియు దృడంగా వుండి ఎక్కువ కాలం బ్రతికేవారు. దీనికిగల కారణం వారు కొబ్బరిని తరచుగా తినేవారు. కొబ్బరి వల్ల శరీరానికి, జుట్టుకి మరియు చర్మ సౌందర్యానికి మేలు జరుగుతుంది. ప్రతిరోజు కొబ్బరిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా మారుతాయి మరియు శరీరంలో రక్త ప్రసరణ మేగుపడుతుంది. కొబ్బరిలో విటమిన్ F మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

కొబ్బరి నూనె ప్రయోజనాలు

  • కొబ్బరి నూనెను ప్రతిరోజు పడుకునే ముందు ముఖం పైన, చేతులు మరియు కాళ్ళు పైనా రాసుకోవడం వల్ల చర్మం చాలా మృదువుగా మెత్తగా తయారవుతుంది.
  • కొబ్బరి నూనెని జుట్టుకి రాసుకుంటే అందులో వున్న యాంటీ బాక్టీరియల్ అనేవి తలలోని బాక్టీరియాని దూరం చేస్తుంది.
  • జుట్టు పెరుగుదలకు కొబ్బరి నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. జుట్టు చివరలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • కొబ్బరి నూనెను జిడ్డు చర్మం లేని వారు మొఖంపై రాసుకుంటే మొటిమలు వల్ల ఏర్పడ్డ నల్లని మచ్చలు మాయం అయిపోతాయి.
  • కొబ్బరి నూనెని చర్మంలో కొల్లాజెన్ ని పెంచి ముడుతలు రావడాన్ని తగ్గిస్తుంది.

కొబ్బరి నూనె దుష్ప్రభావాలు

  • కొబ్బరి నూనెను అలెర్జీ వున్నవారు చర్మం పైన రాసుకుంటే అలెర్జీ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది.
  • పిల్లలకి పాలను ఇస్తున్న తల్లి కొబారి నూనెని రొమ్ములపైన రాయడం వల్ల పాలు తాగే పిల్లలకి చర్మ సమస్యలు మరియు అలెర్జీ వస్తుంది.
  • జిడ్డు చర్మం ఉన్న వారు కొబ్బరి నూనెని చర్మంపై రాయడం వల్ల జిడ్డు ఎక్కువ అయ్యి చర్మం కాంతిని కోల్పోతుంది.
  • అలాగే ఎవరికి అయితే చర్మం చాలా సున్నితంగా ఉంటుందో వారు కొబ్బరి నూనెని చర్మంపై రాయకూడదు.

ఆరోగ్యమైన చర్మానికి కొబ్బరి నూనె ఎలా ఉపయోగించాలి

అందమైన మరియు ఆరోగ్యమైన చర్మం కోసం కొబ్బరి నూని ఎలాంటి సందేహం లేకుండా వాడవచ్చు. కాని జిడ్డు చర్మం ఉన్నవారు మరియు అలెర్జీ వున్నవారు దీనికి దూరంగా ఉంటే మంచిది.

  • ముందుగా మీ చర్మాన్ని మెత్తని గుడ్డతో తుడుచుకోవాలి.
  • తరువాత స్వచ్ఛమైన కొబ్బరి నూనెని మీ ముఖం పై మరియు ఇతర శరీర భాగాలపైనా రాసుకోవాలి.
  • రాయడం అయిపోయిన తరువాత ఒక పలుచటి గుడ్డతో నూనెని తుడవాలి.
  • ఇలా చేసిన తరువాత నిమిషాలు ఆగి శనగపిండితో కడగాలి.
  • ఇలా చేయడం వల్ల చర్మంపై వున్న జిడ్డు తొలగిపోయి చర్మం కాంతివంతంగా కనబడుతుంది.

కొబ్బరిని ప్రతి రోజు తినవచ్చా?

అవును. ఆరోగ్యమైన వ్యక్తులు కొబ్బరిని ఎలాంటి సందేహం లేకుండా ప్రతిరోజు తినవచ్చును.
ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యులను సంప్రదించాలి.

కొబ్బరి నూనెని ప్రతిరోజు ముఖంపై రాయవచ్చా?

అవును. మీరు ప్రతిరోజు కొబ్బరి నూనెని మీ ముఖంపైన తక్కువ మోతాదులలో రాయవచ్చును. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వుండవు.

కొబ్బరి నూనె ముఖం పైన వున్న నల్లని మచ్చలు మరియు కంటి కింద నలుపుని తొలగిస్తుందా

అవును. మీరు క్రమం తప్పకుండా కొబ్బరి నూనెని మొటిమల వల్ల ఏర్పడ్డ మచ్చలపైన రాయడం వల్ల అవి తొలగిపోతాయి. అలాగే కంటి కింద నలుపు కూడా మాయం అవుతుంది.

ఈ వ్యాసం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. ధన్యవాదములు.