How to use Tippa Teega for Health Problems, For What Health Problems can Tippa Teega be Used, When to drink Tippa Teega juice

ఆరోగ్య సమస్యలకు తిప్ప తీగను ఎలా ఉపయోగించాలి, తిప్ప తీగని ఎటువంటి సమస్యలకి ఉపయోగించవచ్చు, అమృతవల్లి ప్రయోజనాలు, వ్యాధులకు తిప్ప తీగని ఎలా ఉపయోగించాలి, తిప్ప తీగ రసాన్ని ఎప్పుడు తాగాలి, దగ్గు మరియు అసిడిటీకి తిప్ప తీగను ఎలా ఉపయోగించాలి

తిప్ప తీగని అనేక ఆరోగ్య సమస్యల కోసం విరివిగా ఉపయోగిస్తారు. తిప్ప తీగను అమృతవల్లి అని కూడా పిలుస్తారు. తిప్ప తీగ యొక్క ఔషధ గుణాలు పిత్త, వాత మరియు కఫాలను చాలా సులభంగా తగ్గిస్తుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకుండా కడుపు ఉబ్బరించడం వంటి సమస్యలను సులభంగా తగ్గిస్తుంది. శరీరంలో వచ్చే వేడిని నియంత్రించి కంటి చూపు మెరుగుపడేందుకు మరియు మగ వారిలో వీర్యం పెంచేందుకు దోహదపడుతుంది.

ఈ వ్యాసంలో మీకు తిప్ప తీగని ఏ వ్యాధులకు ఎలా ఉపయోగించాలి అనే వాటి గురించి చాలా క్లుప్తంగా వివరించాము, ఆర్టికల్ ని చివరి వరకు చదవండి.

తిప్ప తీగని ఎటువంటి సమస్యలకి ఉపయోగించవచ్చు

  1. తిప్ప తీగ వల్ల మంద బుద్ధి ఉన్న వారికి మంచి తెలివి వస్తుంది.
  2. బలహీనంగా ఉన్న మహిళల్లో ఎముకలు గట్టిపడి దృడంగా మారేందుకు ఉపయోగపడుతుంది.
  3. జీర్ణ వ్యవస్థ మరియు మూత్ర విసర్జన సమస్యలు ఉన్న వారికి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
  4. తీవ్ర మరియు దీర్ఘకాలిక జ్వరాన్ని తగ్గిస్తుంది.
  5. కంటి చూపు మరియు వీర్యం మెరుగుపడేందుకు సహాయపడుతుంది.
  6. దగ్గు, ఎక్కిళ్ళు మరియు వాంతులు తగ్గిస్తుంది.
  7. తిప్ప తీగ తరచుగా తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

వ్యాధులకు తిప్ప తీగని ఎలా ఉపయోగించాలి

మూత్ర సమస్యలకి తిప్ప తీగను ఎలా ఉపయోగించాలి

  • మూత్ర విసర్జన సమస్యలు వున్న వారు 15 - 25 ml తిప్ప తీగ రసానికి తేనే కలిపి తీసుకోవడం వల్ల చాలా వేగంగా మూత్ర విసర్జన సమస్య నుంచి బయట పడవచ్చు.
  • ఈ తిప్ప తీగ మరియు తేనె మిశ్రమాన్ని ప్రతి రోజు రెండు పూటలా తీసుకోవాలి.
  • ఈ తిప్ప తీగ రసానికి తేనే స్థానంలో అల్లం కలుపుకుని తింటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.

తీవ్ర మరియు దీర్ఘకాలిక జ్వరానికితిప్ప తీగని ఎలా ఉపయోగించాలి

  • తిప్ప తీగని బాగా దంచి మెత్తని పేస్ట్ లాగా చేసి ఒక గిన్నెలో ఉంచి అందులో కొన్ని నీరు పోసి ఒక రాత్రి మొత్తం అలానే ఉంచండి.
  • మరుసటి రోజు వడపోసి ఆ రసాన్ని రెండు రోజులు తాగితే జ్వరం తగ్గిపోతుంది.
  • అధికంగా జ్వరం వున్నపుడు తిప్ప తీగ, వేప మరియు ఉసిరికి నీళ్లు కలిపి ఒక కాషాయం తయారు చేయాలి.
  • ఆ కషాయానికి అసరిపడ తేనె కలిపి తాగితే ఎంతటి జ్వరం అయినా తగ్గిపోతుంది.
  • తిప్ప తీగ యొక్క పొడికి బెల్లం, తేనె మరియు ఆవు నెయ్యి కలిపి లడ్డు ముద్దలుగా తయారు చేసుకుని ప్రతిరోజు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అంతేకాకుండా కంటి చూపు కూడా పెరుగుతుంది.

బోధ మరియు ఏనుగు కాలు సమస్యకి తిప్ప తీగ ఎలా వాడాలి

  • బోధ మరియు ఏనుగు కాలు సమస్యలతో బాధ పడుతున్నవారు తిప్ప తీగని ఉపయోగిస్తే ఆ సమస్య నుంచి బయటపడతారు.
  • అందుకోసం మీరు తిప్ప తీగ రసానికి ఆవ నూనె కలిపి తాగాలి.
  • ఇలా కొన్ని వారాల పాటు చేస్తే ఏనుగు కాలు సమస్య తగ్గిపోతుంది మరియు కుష్ఠు వ్యాధి కూడా నయం అవుతుంది.

దగ్గు మరియు అసిడిటీకి తిప్ప తీగను ఎలా ఉపయోగించాలి

  • కఫం సమస్యలు ఉన్నవారు తిప్ప తీగ యొక్క రసంలో కొంచెం తేనె కలిపి తాగయితే కఫం తగ్గిపోతుంది.
  • ఎసిడిటీ ని తగ్గించడానికి తిప్ప తీగ రసంలో బెల్లం లేదా చక్కెర కలిపి తీసుకోవాలి.
  • దగ్గు సమస్య తగ్గడానికి తిప్ప తీగ రసాన్ని వేడి నీటిలో కలిపి తాగాలి.
  • ఇలా చేయడం వల్ల దగ్గు మరియు ఛాతి నొప్పి తగ్గుతాయి.

తిప్ప తీగ రసాన్ని ఎప్పుడు తాగాలి ?

  • ఉదయం లేచిన వెంటనే ఎలాంటి ఆహరం తినకముందు తిప్ప తీగ రసాన్ని తాగాలి.
  • అంటే పడగడపున తిప్ప తీగ రసాన్ని తాగడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
  • మనకు ఈ తిప్ప తీగ పదార్థాలు ఆన్లైన్ లో సులభంగా లభిస్తాయి.

తిప్పతీగ రసం శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందా

అవును, తిప్ప తీగ రసం శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.మరియు కరోనా వైరస్ లాంటి అంటు వ్యాధుల నుంచి కాపాడుతుంది.

వాసాన్ని చివరి వరకు చదివినందుకు ధన్యవాదాలు