త్రిఫల చూర్ణం అంటే ఏమిటి, ఆరోగ్యం కోసం త్రిఫల పొడిని ఎలా ఉపయోగించాలి, త్రిఫల చూర్ణం ప్రయోజనాలు, త్రిఫల చూర్ణం ఎక్కడ దొరుకుతుంది
త్రిఫల చూర్ణం అంటే ఏమిటి
త్రిఫల చూర్ణం అనేది మూడు రకాల పదార్ధాల యొక్క మిశ్రమం ఇందులో ఉసిరి, కరక్కాయ మరియు తానికాయలను ఉపయోగిస్తారు. త్రిఫల చూర్ణం తెలియని భారతీయ పూర్వీకులు ఎవరూ వుండరు ఎందుకంటే త్రిఫల చూర్ణం వాత, పిత్త మరియు కఫాలకు పని చేస్తుంది. త్రిఫల చూర్ణంలో వున్న ఉసిరి వేడిని తగ్గించుటకు, కరక్కాయ జీర్ణ వ్యవస్థ పనితీరుపై మరియు తాని కాయ నాడీ వ్యవస్థని మెరుగుపరచుటకు పని చేస్తుంది. త్రిఫల చూర్ణంలో ఉన్న పోషకాలు మన శరీరంలో వచ్చే అనారోగ్యాలనుంచి కాపాడుతుంది. దీనిని రాత్రి పడుకునే ముందు పాలలో కలిపి తాగడం వల్ల దీని యెక్క ప్రయోజనాలను పొందవచ్చు.
త్రిఫల చూర్ణం ప్రయోజనాలు
ఆరోగ్యం కోసం త్రిఫల పొడిని ఎలా ఉపయోగించాలి
త్రిఫల చూర్ణం యొక్క ప్రయోజనాలను పొందడం కోసం ఈ చూర్ణాన్ని పాలలో కలిపి రాత్రి పడుకునే ముందు తాగాలి. అధిక మోతాదులలో వాడాలి అనుకున్నవారు దగ్గరలోని డాక్టర్ ని సంప్రదించి ఉపయోగించాలి. ఎందుకంటె త్రిఫల చూర్ణంలో మూడు పదార్థాలు ఒకే స్థాయిలో ఉండవు కాబట్టి. త్రిఫల చూర్ణంలో ఉసిరి మూడు భాగాలు, తాని కాయ రెండు భాగాలు మరియు కరక్కాయ ఒక భాగం ఉంటుంది.
త్రిఫల చూర్ణం ఎలా నిల్వ ఉంచాలి
త్రిఫల చూర్ణం చాలా సున్నితమైనది దానికి గాలి తగిలితే దాని యొక్క గుణాలను కోల్పోతుంది కాబట్టి ఒక గాజు సీసా తీసుకుని అందులో ఈ త్రిఫల చూర్ణం వేసి గాలి తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
త్రిఫల చూర్ణం ఎక్కడ దొరుకుతుంది
త్రిఫల చూర్ణం ఆన్లైన్ లో మరియు ఆయుర్వేద అంగడిలో కూడా దొరుకుతుంది. కాకపోతే మనం తయారు చేసుకున్న పొడి చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది అలాగే అధిక ప్రయోజనాలను చేకూరుస్తుంది.
ఈ వ్యాసం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.

- త్రిఫల చూర్ణం బలహీనంగా వున్న వారు పాలల్లో కలిపి తాగడం వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
- పంటి నొప్పికి త్రిఫలా పొడి చక్కటి పరిష్కారం.
- కంటి సమస్యలు వున్న వారు తాగితే కంటి చూపు మెరుగుపడుతుంది.
- టైప్ 2 డయాబెటిస్ , చర్మ సౌందర్యానికి మరియు జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది.
- జీర్ణ వ్యవస్థ సమస్యలు వున్న వారు త్రిఫలాన్ని తీసుకుంటే తిన్న ఆహారం చాలా చక్కగా జీర్ణం అవుతుంది.
- మలబద్దకం వున్నవారు త్రిఫలాన్ని పడుకునేముందు పాలల్లో కలిపి తాగితే మలబద్దకం తగ్గిపోతుంది.
- ఉసిరి శరీరంలో వున్న వేడిని తగ్గించి చల్లబరుస్తుంది.
- తానికాయ నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపి నాడీ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది.
- రక్తం శుద్ధి చేయుటలో త్రిఫలం చాలా బాగా పనిచేస్తుంది.
- ఋతుచక్రం సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహామేరకు త్రిఫల చూర్ణం తీసుకుంటే సమస్యలను అధిగమిస్తారు.