What is Triphala Churnam, How to make Triphala Churnam, Benefits of Triphala Churnam

త్రిఫల చూర్ణం అంటే ఏమిటి, త్రిఫల చూర్ణం ఎలా తయారు చేయాలి, త్రిఫల చూర్ణం ప్రయోజనాలు, త్రిఫల చూర్ణం ఎలా నిల్వ ఉంచాలి

త్రిఫల చూర్ణం అంటే ఏమిటి

ఉసిరి, తానికాయ మరియు కరక్కాయలను కలిపి ఒక మెత్తని పొడిలాగా తాయారు చేస్తే దానినే త్రిఫల చూర్ణం అంటారు. త్రిఫల చూర్ణం తెలియని భారతీయ పూర్వీకులు ఎవరూ వుండరు ఎందుకంటే త్రిఫల చూర్ణం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకంగా ఉంటాయి కాబట్టి. త్రిఫలా చూర్ణంలో వున్న ఉసిరి వేడిని తగ్గించుటకు, కరక్కాయ జీర్ణ వ్యవస్థ పనితీరుపై మరియు తాని కాయ నాడీ వ్యవస్థని మెరుగుపరచుటకు పని చేస్తుంది. త్రిఫల చూర్ణంలో ఉన్న పోషకాలు మన శరీరంలో వచ్చే అనారోగ్యాలనుంచి కాపాడుతుంది. దీనిని రాత్రి పడుకునే ముందు పాలలో కలిపి తాగడం వల్ల దీని యెక్క ప్రయోజనాలను పొందవచ్చు.

త్రిఫల చూర్ణం యొక్క పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వ్యాసాన్ని చివరి వరకు చదవండి.

త్రిఫల చూర్ణం ప్రయోజనాలు

  • త్రిఫల చూర్ణం బలహీనంగా వున్న వారు పాలల్లో కలిపి తాగడం వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
  • కంటి సమస్యలు వున్న వారు తాగితే కంటి చూపు మెరుగుపడుతుంది.
  • జీర్ణ వ్యవస్థ సమస్యలు వున్న వారు త్రిఫలాన్ని తీసుకుంటే తిన్న ఆహారం చాలా చక్కగా జీర్ణం అవుతుంది.
  • కడుపులో ఉన్న మలినాలు మరియు బాక్టీరియా కూడా తొలగిపోతుంది.
  • ఉసిరి శరీరంలో వున్న వేడిని తగ్గించి చల్లబరుస్తుంది.
  • తానికాయ నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపి నాడీ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది.
  • రక్తం శుద్ధి చేయుటలో త్రిఫలం చాలా బాగా పనిచేస్తుంది.

త్రిఫల చూర్ణం ఎలా తయారు చేయాలి

కావలసినవి :

  • ఉసిరి 200 గ్రాములు
  • కరక్కాయలు 150 గ్రాములు
  • తానికాయ 80 గ్రాములు

తయారుచేయు విధానం :

  • ఉసిరి, తానికాయ మరియు కరక్కాయలను ఎండలో 3 - 4 రోజులపాటు ఎండబెట్టాలి.
  • బాగా ఎండిన తరువాత వాటి నుంచి గింజలను బయటికి తీసివేయాలి.
  • ఆ కాయలను సన్నని ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మెత్తని పొడిలాగ తయారు చేయాలి.
  • ఇలా వచ్చిన పొడినే త్రిఫల చూర్ణం అంటారు.

శీతాకాలంలో ఎండలు తక్కువగా వుంటాయి అందుకోసం మీరు ఉసిరి, కరక్కాయ మరియు తాని కాయలను మైక్రోవేవ్ లో వేసి 10 - 12 నిమిషాలు ఉంచవచ్చు. తరువాత వాటినుంచి గింజలు తీసివేసి సన్నని ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకొని పొడిలాగా చేసుకోవచ్చు.

త్రిఫల చూర్ణం ఎలా నిల్వ ఉంచాలి

త్రిఫల చూర్ణం చాలా సున్నితమైనది దానికి గాలి తగిలితే దాని యొక్క గుణాలను కోల్పోతుంది కాబట్టి ఒక గాజు సీసా తీసుకుని అందులో ఈ త్రిఫల చూర్ణం వేసి గాలి తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

ఈ వ్యాసం మీకు ఎంతగానో ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.