Which Foods are High in Calcium, How Much Calcium Does the Body Need Every day, Side Effects of Calcium

అధికంగా కాల్షియం వున్న ఆహార పదార్థాలు ఏవి, ప్రతిరోజు శరీరానికి కాల్షియం ఎంత అవసరం, కాల్షియం వల్ల కలిగే దుష్ప్రభావాలు, కాల్షియం అధికంగా లభించే ఆహార పదార్థాలు

calcium rich foods:
మన శరీరంలో ప్రోటీన్స్, ఐరన్ ఎంత అవసరమో కాల్షియం కూడా అంతే అవసరం. ఈ కాల్షియం ఎముకలు గట్టిపడటానికి సహాయ పడుతుంది. చాలా మందికి దంతాల సమస్య ఉంటుంది దానికి ప్రధాన కారణం కాల్షియం తగ్గిపోవడం. నాడీ వ్యవస్థ యెక్క పనితీరుని మెరుగుపరచడానికి కాల్షియం ఎంతగానో ఉపయోగపడుతుంది.

శరీరానికి కాల్షియం ఎంత అవసరం

18 నుండి 60 సంవత్సరాలు వున్న వారు ప్రతిరోజూ కనీసం 1000 mg నుండి 1,100 mg వరకు కాల్షియం ఆహారంలో భాగంగా తీసుకుని శరీరానికి అందించాలి. అప్పుడు మాత్రమే మీ యొక్క శరీరంలో ఎముకలు, దంతాలు మరియు నాడీ వ్యవస్థ సరైన పద్ధతిలో పనిచేస్తాయి.

కాల్షియం అధికంగా లభించే ఆహార పదార్థాలు

  • పాలు మరియు పాల నుంచి తయారయ్యే ఆహారపదార్థాలు.
  • సముద్రం నుంచి లభించే సముద్రపు పదార్థాలు అయినా చేపలు, పీతలు మొదలైనవి.
  • బాదం
  • నువ్వులు
  • సోయా బీన్స్
  • వేరుశనగ
  • గుడ్డు

పండ్లు మరియు కురగాయలు

  • నేరేడు పండు
  • బొప్పాయి
  • ఎండు ద్రాక్ష
  • కరివేపాకు
  • పాలకూర
  • పుదీనా

ఎవరికైన ఎక్కువ మోతాదులలో కాల్షియం కావలి అనుకున్నప్పుడు కరివేపాకు తింటే తక్కువ సమయంలో అధికంగా కాల్షియం పొందవచ్చు.

కూరగాయలు

కూరగాయలు తినడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. ఫైబర్ ఎక్కువగా వున్న క్యారెట్ తినడం వల్ల శరీరానికి పోషకాలు మరియు కాల్షియం అధికంగా లభిస్తుంది.

ఆరంజ్ మరియు చీనీకాయాలు

సాధారణంగా పుల్లని కాయలలో ఎక్కువగా సీ విటమిన్ ఉంటుంది అందువల్ల ఎముకలు మరియు దంతాలు బలంగా తయారవుతాయి. అదేవిధంగా వీటిల్లో కాల్షియం కూడా పుష్కలంగా లభిస్తుంది.

పాలు మరియు పాల ఉత్పత్తులు

పాలల్లో కాల్షియం ఉంటుంది అంతేకాకుండా ఈ పాలతో తయారు చేసే పాల ఉత్పత్తుల్లో కూడా కాల్షియం ఉంటుంది. పాల నుంచి తయారయ్యే పెరుగు, జున్ను మరియు వెన్నలో తగినంత కాల్షియం ఉంటుంది. అందువల్ల చిన్న పిల్లలకు పాలు ద్వారా తయారయ్యే పదార్థాలను ఆహారంలో భాగంగా చేస్తేయ్ పిల్లల్లో ఎముకలు దృఢంగా తయారవుతాయి.

వయస్సు పెరిగిన వారు ఎవరైతే ఎముకలు పెళుసుగా మారి నొప్పులతో బాధ పడుతుంటారో వారు కాల్షియాన్ని ఆహారంతో పాటు మార్కెట్లో దొరికే సప్లిమెంటరీ కూడా తీసుకుంటారు. అలా చేయడం వల్ల కూడా శరీరంలో కాల్షియం స్థాయిని పెంచుకోవచ్చు.

కాల్షియం వల్ల కలిగే దుష్ప్రభావాలు

ఏదైనా కూడా ఎక్కువ అయితే దాని వల్ల మంచితో పాటు చెడు కూడా జరుగుతుంది. అలాగే శరీరంలో కాల్షియం ఎక్కువ అయితే కొన్ని సమస్యలు ఉంటాయి.

  • శరీరంలో కాల్షియం ఎక్కువ అయినప్పుడు మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడతాయి.
  • థైరాయిడ్ సమస్యల కోసం ఉపయోగించే మందులు సరిగా పనిచేయవు.
  • కొన్ని సార్లు కాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని సైన్స్ చెబుతోంది.

మేము రాసిన ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.