Which Foods are Rich in Iron, What Food to eat to Increase Iron in the Body, What is the Importance of Iron in the Body

అధికంగా ఐరన్ లభించే ఆహార పదార్థాలు ఏవి, శరీరంలో ఐరన్ పెరుగుదలకు ఏ ఆహారం తినాలి, శరీరంలో ఐరన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి

శరీరంలో ఐరన్ యొక్క ప్రాముఖ్యత

మానవుని శరీరంలో అనేక రకాలైన ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి వాటిల్లో ముఖ్యమైనది ఐరన్. ఐరన్ శరీరంలో తక్కువ అయినప్పుడు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిల్లో ముఖ్యంగా రక్తహీనత మరియు బలహీనంగా తయారవ్వడం. ఈ సమస్యలనుంచి బయట పడటానికి మనం అధికంగా ఐరన్ లభించే ఆహార పదార్థాలను తినాలి. అప్పుడు శరీరంలో ఐరన్ స్థాయి పెరిగి రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు కండరాలు పటిష్టంగా తయారవుతాయి.

అధికంగా ఐరన్ లభించే ఆహార పదార్థాలు

  • గుమ్మడి గింజలు
  • చిక్కుడు కాయలు
  • పాలకూర
  • ఎండుద్రాక్ష
  • గుడ్లు
  • పాలు
  • డ్రై ఫ్రూప్ట్స్
  • మేక మాంసం
  • పప్పు ధాన్యాలు

గుమ్మడి గింజలు

గుమ్మడి గింజలు ఆరోగ్యానికి మరియు శరీరానికి రెండిటికి ఎంతగానో సహాయపడతాయి. ఇందులో విటమిన్స్, ప్రోటీన్స్ అధికంగా ఉండి శరీరంలో కండరాల పెరుగుదలకు సహాయపడి శరీరంలో రక్త ప్రసరణని మరియు నాడీ వ్వవస్థ పనితీరుని నియంత్రణలో వుంచుతాయి. గుమ్మడి గింజలు శరీరంలో కొలెస్టాలుని తగ్గించి గుండె జబ్బులు రాకుండా ఆపుతుంది.

చిక్కుడు కాయలు

సాధారణంగా చిక్కుళ్ళలో శరీరానికి కావలసిన ఐరన్ తో పాటుగా ప్రోటీన్స్, ఫైబర్, జింక్, కార్బోహైడ్రాట్, మెగ్నీషియం, కాపర్ మొదలైన పోషకాలు లభిస్తాయి. ఇవి శరీరంలో కండరాల ఎదుగుదలకి సహాయపడుతాయి. కొన్నిరకాలైన మధుమేయం, గుండె జబ్బులు నయం అవుతాయి.

పాలకూర

పాలకూరలో అన్ని ఆహార పదార్థాలకంటే ఎక్కువ మొత్తంలో మనకి ఐరన్ లభిస్తుంది. ఇందులో ఐరన్ మాత్రమే కాదు శరీరానికి కావల్సిన విటమిన్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. పాలకూర కాన్సర్ తో పోరాడటానికి సహాయపడుతుంది. పాలకూర తినడం వల్ల రక్తంలోని హిమోగ్లోబిన్ పెరుగుతుంది. కంటి చూపు మెరుగుపడటానికి సహాయపడుతుంది.

ఎండుద్రాక్ష

రక్తహీన నుంచి బయటపడటంతో ఎండు ద్రాక్ష చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఎవరికి అయితే శరీరంలో రక్తహీనత మరియు ఐరన్ తక్కువ వుంటుందో వాళ్ళు ఎండు ద్రాక్ష ప్రతి రోజు తినాలి. ఎండు ద్రాక్షలో వున్న విటమిన్ బి కాంప్లెక్స్ రక్తాన్ని శుద్ధి చేసి హిమోగ్లోబిన్ పెంచుతుంది.

గుడ్లు

కోడి గుడ్డులో వున్నటువంటి ప్రోటీన్లు, ఖనిజాలు మరియు విటమిన్లు ఇతర ఏ ఆహారంలో కూడా లాభించవు. అందువల్ల రోజు 2 గుడ్లు తినడం చాలా అవసరం. శరీరం దృఢంగా తయారవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కోడి గుడ్డు.

డ్రై ఫ్రూప్ట్స్ మరియు పప్పు ధాన్యాలు

డ్రై ఫ్రూప్ట్స్ మరియు పప్పు ధాన్యాలలో ప్రతిఒక్క పోషకం లభిస్తుంది. మీరు తినే ఆహారంలో పప్పు ధాన్యాలను లేదా డ్రై ఫ్రూప్ట్స్ చేర్చుకుంటే మీరు ఇంటి వద్దనే ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు. ప్రతి 100 గ్రాముల పప్పు ధాన్యాలలో 1.5 మిల్లి గ్రాముల ఐరన్ లభిస్తుంది. అలాగే డ్రై ఫ్రూప్ట్స్ లో ప్రతి 100 గ్రాములలో 1.5 మిల్లి గ్రాముల ఐరన్ లభిస్తుంది.

ఈ వ్యాసం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. ధన్యవాదములు.