Neem Oil Benefits for Health, How to use Neem Leaves to Reduce Chickenpox, Side Effects of Neem Oil, Neem Tree Benefits in Telugu

వేప చెట్టు ప్రయోజనాలు, ఆరోగ్యానికి వేప నూనె ప్రయోజనాలు, అమ్మోరుని తగ్గించుటకు వేప ఆకులను ఎలా ఉపయోగించాలి, ఆరోగ్యానికి వేప నూనె ఎలా ఉపయోగించాలి, వేప నూనె యొక్క దుష్ప్రభావాలు

వేప చెట్టు యొక్క ప్రతి ఒక్క భాగం ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటాయి. చెట్టు యొక్క వేర్ల నుంచి కాయల వరకు అన్నింటినీ ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. వేపలో ఉన్న గుణాలు క్రిమిసంహారానికి ఉపయోగపడతాయి. అందువల్ల వేపతో ఔషధాలను తయారుచేసి ఆరోగ్య ప్రయోజనాలకోసం ఉపయోగిస్తున్నారు.

వేప వల్ల ఆరోగ్యానికి, అందానికి మరియు జుట్టుకి కలిగే ప్రయోజనాలను ఈ వ్యాసంలో క్లుప్తంగా వివరించాము ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

వేప చెట్టు ప్రయోజనాలు

  • వేప ఆకులను ఉపయోగించి పేస్ ప్యాక్ తయారుచేసుకోవచ్చు. ఇది అందమైన చర్మం కోసం ఉపయోగపడుతుంది.
  • వేప కొమ్మలను కొన్ని రకాల ఔషధాలలో ఉపయోగిస్తారు.
  • వేప పుల్లలతో నోటిలోని దుర్వాసనను మరియు క్రిములను దూరం చేయవచ్చు.
  • వేప గింజలతో వేప నూనె తయారు చెయ్యచ్చు. ఇది జుట్టు సమస్యలతో పోరాడుతుంది.
  • అలాగే వేప చెట్టు కాండంతో ఇంటికి ఉపయోగపడే గుమ్మలను మరియు కిటికీలను తయారుచేసుకోవచ్చు.
  • వేప ఆకులకి పసుపు కలిపి చర్మానికి రాయడం వల్ల దురద మరియు అమ్మవారు లాంటి అంటువ్యాధులు తగ్గించవచ్చు.

ఇప్పుడు వేప నూనె యొక్క ప్రయోజనాలను తెలుసుకుందాం.

ఆరోగ్యానికి వేప నూనె ప్రయోజనాలు

చుండ్రుని తగ్గిస్తుంది

వేపలో అనేక రకాలైన బాక్టీరియాని చంపేసే గుణాలు ఉన్నాయి. మనకి తలలో చుండ్రు కూడా ఒకరకమైన ఫంగస్ వల్ల వస్తుంది. అలాంటి ఫంగస్ దూరం అవ్వడానికి వేప నూనెను ఉపయోగించవచ్చు. ఈ వేపలోని చెడు మరియు ఘాటు వల్ల తల శుభ్రం అయ్యి జుట్టు పెరుగుతుంది. కాకపోతే వేప నూనె కొంచెం ఘాటైన వాసన కలిగి కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది.

జుట్టు పెరుగుదలకు వేప నూనె

వేప నూనెలో జుట్టు పెరుగుదలకి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా వున్నాయి. ఇందులోని యాంటీ బాక్టీరియల్ గుణాలు తలలోని చెత్తని దూరం చేస్తే పోషకాలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. అందువల్ల పల్లెటూర్లలో చాలామంది వేప నూనెను తలకు ఉపయోగిస్తుంటారు.

దంతాల సమస్యకు వేప నూనె

ఏ నొప్పి వచ్చినా భరించవచ్చు కాని దంతాల నొప్పి వస్తే భరించడం చాక కష్టం. పిప్పి పళ్ళు ఎక్కువ నొప్పిని కలిగ్గిస్తాయి. అటువంటి నొప్పిని తగ్గించడానికి మనం వేప నూనెను ఉపయోగిస్తే నొప్పి సులభంగా తగ్గిపోతుంది. అందుకోసం వేపనూనెను పిప్పి పళ్ళు వున్న చోట రాయాలి.

కీటకాలు రాకుండా ఉండేందుకు

వర్షా కాలంలో దోమలు మరియు కీటకాలు ఎక్కువగా వుంటాయి అలాంటి సమయంలో మనం చాలా రకాల వాయువులను ఉపయోగిస్తుంటాము కాని వాటి స్థానంలో మనం ఈ వేప నూనెను ఉపయోగిస్తే దానియొక్క ఘాటైన వాసన వాళ్ళ క్రిములు, కీటకాలు ఆ పరిసరాలకు చేరవు.

సోరియాసిస్ తగ్గించడానికి వేప నూనె

సోరియాసిస్ అనేది శరీరంపై మట్టి పేరుకుపోవడం వల్ల మరియు చెమట ఆరిపోయి బాక్టీరియా ఏర్పడటం వల్ల వస్తుంది. ఇలాంటి వాటిని విటమిన్ E కలిగినటువంటి వేప నూనె చాలా తొందరగా తగ్గిస్తుంది.

ఈ వేప నూనెకి కొంచెం ఆలివ్ ఆయిల్ బాగా కలిపి సోరియాసిస్ వున్న చోట రాస్తే తగ్గిపోతుంది. ఇలా కొన్ని రోజుల పారు చేస్తే డాక్టర్ అవసరం ఉండదు.

మొటిమలు తొలగించడానికి వేప నూనె

వేప నూనెను ఉపయోగించి మొటిమలను దూరం చేయవచ్చును అందుకోసం వేప నూనెకి ఆలివ్ ఆయిల్ కలిపి మొటిమలు ఉన్న చోట రాయాలి. ఇలా చేస్తే చర్మంపై తేమ శాతం పెరిగి జిడ్డు రాకుండా ఉంటుంది.

Neem For Chickenpox అమ్మోరుని తగ్గించుటకు వేప ఆకులను ఎలా ఉపయోగించాలి

  • చిగురు వేప ఆకులు తీసుకుని బాగా దంచాలి.
  • ఈ మెత్తని వేప ముద్దకి పసుపు కలిపి కొన్ని నీళ్ళు వేసి రుబ్బి పేస్ట్ లాగా తయారు చేయాలి.
  • అమ్మోరు వున్న శరీర భాగం మొత్తం కూడా ఈ వేప పేస్ట్ రాయాలి.
  • నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.
  • ఇలా ఒక వారం పాటు చేస్తే అమ్మోరు తగ్గిపోతుంది.

వేప నూనె యొక్క దుష్ప్రభావాలు
  • వేప నూనెను కేవలం శరీర భాగాలకు మాత్రమే ఉపయోగించాలి తప్ప తాగకూడదు. తాగితే కడుపులో వికారం పుట్టి వాంతులు అవుతాయి.
  • కొంతమందికి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది అలాంటి వాళ్లు వేప నూనెను ఒంటి మీద రాసుకోకూడదు. దురదలు వచ్చేస్తాయి.
  • మీరు సహజమైన వేప నూనె వాడినంత వారికి ఎలాంటి ప్రమాదాలు ఉండవు కాని మార్కెట్లో దొరికే వేప నూనెని వాడితే చాలా దుష్ప్రభావాలు ఉంటాయి.

ఈ వ్యాసం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.