What Should be Done to Increase Immunity in the Body, Major Causes of Decreased Immunity, Ways to Increase Immunity in the Body

శరీరంలో రోగానిరోధక శక్తి పెరగాలంటే ఏమి చేయాలి, శరీరంలో రోగానిరోధక శక్తి పెరగడానికి మార్గాలు, వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడానికి గల ప్రధాన కారణాలు,

Improve Immunity Power ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం చాలా అవసరం. కాని కొన్ని సందర్భాలలో అనుకోకుండా అనారోగ్యం చెందుతుంటారు. అందుకు ప్రధాన కారణం శరీరంరంలో బాక్టీరియా లేదా వైరస్ ని ఎదుర్కునే శక్తి లేకపోవడమే. దీనికి అర్థం శరీరంలో బాక్టీరియాతో పోరాడేందుకు సరైన వ్యాధినిరోధక శక్తి లేకపోవడమే. అలాంటి వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి అనేక మార్గాలున్నాయి వాటిని పాటించడం ద్వారా తప్పకుండ శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

ఈ వ్యాసంలో వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకు మార్గాలను తెలియజేస్తున్నాము. అన్ని ప్రయోజనాలు పొందడానికి ఆర్టికల్ చివరి వరకు చదవండి.

శరీరంలో రోగానిరోధక శక్తి పెరగడానికి మార్గాలు

  • ప్రతిరోజు 7 నుంచి 8 గంటలపాటు తప్పకుండ నిద్రపోవాలి.
  • పోషక విలువలు కలిగిన ఆహారం తినాలి.
  • రోడ్డుసైడే దొరికే జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్ తినరాదు.
  • ఆరోగ్యానికి హానికరమైనటువంటి మద్యపానం మరియు ధూమపానం చేయరాదు.
  • మీరు తినే ఆహారంలో చక్కర మరియు ఉప్పు అధికంగా లేకుండా చూసుకోవాలి.
  • పండ్లు, కూరగాయలను మరియు ఆకుకూరలను బాగా తినాలి.
  • వారానికి కనీసం 3 సార్లు మాంసం, పాలు మరియు గుడ్డు ఉండేలా చూసుకుంటే మంచిది.
  • ప్రతిరోజు వ్యాయామం లేదా పరిగెత్తడం తప్పనిసరి.

మీరు ఈ నియమాలను పాటిస్తే తప్పకుండ మీ శరీరానికి కావలసినంత Immunity Power వ్యాధినిరోధక శక్తి లభిస్తుంది.

వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడానికి గల ప్రధాన కారణాలు

పనిలో ఒత్తిడి

మారుతున్న కాలానుగుణంగా ప్రజల యొక్క పని వేళల్లో కూడా మార్పులు వస్తున్నాయి. అందువల్ల మెదడు ఒత్తిడికి గురి అవుతున్నది. ఎప్పుడు అయితే మెదడు ఒత్తిడికి గురి అవుతుందో ఆ సమయంలో Anxiety వస్తుంది. దీని కారణంగా వ్యాధినిరోధక శక్తి తగ్గపోతుంది. కుంగుబాటుకి లోనఅవ్వకుండా వుండాలి అంటే పని వేళల్లో మీకు నచ్చిన ఆహరం తినడం మరియు ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడటం వంటివి చేయాలి.

సరైన నిద్ర లేకపోవడం

వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడానికి ప్రధాన కారణం కంటినిండా నిద్ర లేకపోవడం. సరైన నిద్ర లేకపోవడం వల్ల చిరాకుగా మరియు సోమరిగా తయారయ్యి శరీరంలో ఉన్న ఉగాధినిరోధక శక్తిని కోల్పోతారు. అందువల్ల కంటినిండా నిద్ర చాలా అవసరం.

మద్యపానం, ధూమపానం చేయడం

మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా ఎవరు మానకపోవడం చాలా బాధాకరం. దీనివల్ల మీ ఆరోగ్యం చాలా చెడిపోతుంది. మద్యపానం చేయడం వల్ల వ్యాధినిరోధకశక్తి తగ్గిపోయి ఊపితిత్తుల సమస్యలు, గుండె జబ్బులు మరియు శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి.

అపరిశుభ్రమైన ఆహారం

ఎక్కువ మసాలా మరియు జంక్ ఫుడ్ తినడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక వాంతులు, బదులు అవుతాయి ఆ సమయంలో కూడా వ్యాధినిరోధక శక్తిని కోల్పోతారు. అందువల్ల మంచి ఆహారపు అలవాట్లను పాటించడం చాలా అవసరం.

మేము రాసిన ఈ వ్యాసం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.