What Boosts Your Immune System, What are the Fruits and Vegetables That Boost Immunity, What Rules Should be Followed to Increase Immune System

మీ రోగనిరోధక వ్యవస్థను ఏది పెంచుతుంది, వ్యాధినిరోధక శక్తిని పెంచే పండ్లు, వ్యాధినిరోధక శక్తిని పెంచే కూరగాయలు, వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి కొన్ని నియమాలు పాటించాలి

మారుతున్న కాలం ప్రకారం మానవుని ఆయుష్షు కూడా తగ్గిపోతోంది. దీనికి ప్రధాన కారణం మనం తీసుకుంటున్న ఆహరం. ఎప్పుడు అయితే సంప్రదాయబద్ధమైన ఆహారాన్ని తినడం మానేసి విదేశీయ ఆహారపు అలవాట్లను ప్రారంభించాడో ఆ రోజు నుంచే భారతీయులు అనారోగ్యంపాలై ఆయుష్షును తగ్గించేసుకుంటున్నారు. మన భారతీయ ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరిగి కరోనా లాంటి ప్రమాదకరమైన వైరస్ నుంచి కూడా బయట పడతారు.

అలాంటి కొన్ని వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాల గురించి ఈ వ్యాసంలో తెలియజేస్తాము. చివరి వరకు చదవండి.

మీ రోగనిరోధక వ్యవస్థను ఏది పెంచుతుంది

వ్యాధినిరోధక శక్తిని పెంచే పండ్లు

  • ద్రాక్షపళ్ళు
  • జామకాయ
  • నిమ్మకాయలు
  • అరటిపండు
  • కివి పండు
  • పనస
  • నేరేడు పండు

పైన చెప్పిన అన్ని పండ్లలో విటమిన్లు, కాల్షియం, ఐరన్ మరియు విటమిన్లు పుష్కలంగా వుంటాయి. అవి తినడం వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మరియు ఇవన్నీ వాటి సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి వాటిని తప్పక తినాలి.

వ్యాధినిరోధక శక్తిని పెంచే కూరగాయలు

అల్లం

అల్లంలో ఉన్న గుణాలు శరీరంలోకి ప్రవేశించిన బాక్టీరియాని చంపేసి రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. అల్లం శీతాకాలంలో వచ్చే జలుబు గొంతు నొప్పిని డాక్టర్ సహాయం లేకుండా నయం చేస్తుంది. కొలెస్ట్రాల్ అధికంగా వున్న వారు అల్లం తినడం వల్ల అదుపులో వుంచుకోగలరు.

ఉసిరికాయ

ఉసిరికాయలో దొరికినంత సి విటమిన్ మరి ఏ ఇతర ఆహార పదార్థాలలో కూడా లభించదు. ఇది కూడా సంవత్సరంలో కొన్ని నెలల్లో మాత్రమె దొరుకుతుంది. అందువల్ల దీనినిఊరగాయ చేసుకుని నిల్వ ఉంచుకుని తినడం చాలా మంచిది. ఉసిరిలో వున్న కాల్షియం మరియు ఐరన్ రోగాల బారిన పడకుండా ఉండేందుకు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.

ఆకుకూరలు

చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే ఆకుకూరలు శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందని. ఆకుకూరల్లో కేవలం ప్రొటీన్స్ మాత్రమే తక్కువగా వుంటాయి మిగిలిన అన్ని పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. పొటాషియం,జింక్, కాల్షియం, భాస్వరం, ఐరన్, రాగి మరియు అన్ని రకాల విటమిన్లు కూడా ఒక్క ఆకుకూరల్లోనే లభిస్తాయి. అటువంటి ఆకుకూరలు మీ ఆరోగ్యాన్ని కాపాడేందుకు శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.

గుమ్మడి గింజలు మరియు పొద్దు తిరుగుడు విత్తనాలు

గుమ్మడి గింజలు మరియు పొద్దు తిరుగుడు విత్తనాలు రెండు కూడా అధికంగా ప్రోటీన్ కలిగి ఉంటాయి. ఇవి తినడం వల్ల రక్తం శుద్ధి జరిగి మలినాలు తొలగిపోతాయి మరియు కండరాలు పెరుగుదలకి తోడ్పడతాయి. వెంట్రుకలు దృడంగా అయ్యి యవ్వనంగా కనిపించేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి.

పసుపు

రోగనిరోధక శక్తిని పెంచడంలో పసుపు పనిచేసినట్లు మరి ఏ పదార్థం కూడా చేయలేదు. యాంటీ బాక్టీరియాని పెంచడానికి పసుపు చాలా ముఖ్యమైనది. జలుబు, దగ్గు మరియు గొంతు నొప్పి వున్నవారు పసుపుని వేడి పాలల్లో వేసుకుని తాగడం వల్ల అవన్నీ కూడా నయం అయిపోతాయి. ముఖ్యంగా పసుపు యాంటీ మైక్రోబియల్, ఇమ్మ్యూనోమోడ్యులరి అనే లక్షణాలను కలిగి ఉంటుంది అందువల్లనే పసుపు అంత బాగా పనిచేస్తుంది.

పాలు మరియు పాల ఉత్పత్తులు

పాలల్లో కొంచెం పసుపు మరియు మిరియాల పొడిని కలుపుకొని రోజు ఒక గ్లాసు తాగడం వల్ల శరీరంలో కరోనా వైరస్ లాంటి వ్యాధులను కూడా ఎదుర్కునే శక్తి వస్తుంది. అలాగే పాల నుంచి తయారయ్యే పెరుగులో కూడా వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయి. అందువల్ల పెరుగుని రోజు వారి ఆహారంలో తీసుకోవడం చాలా మంచిది.

వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి కొన్ని నియమాలు పాటించాలి

  • శీతల పానీయాలను తాగవద్దు.
  • అధికంగా మసాలా కలిగిన ఆహార తినవద్దు.
  • మద్యపానం మరియు ధూమపానం చేయరాదు.
  • ఎక్కువ తీపి మరియు ఉప్పు కలిగిన పదార్ధాలను తినడం తగ్గించాలి.
  • రోడ్ సైడ్ దొరికే ఫాస్ట్ ఫుడ్ తినరాదు.
  • ప్రతిరోజు వ్యాయామం చేసి సరైన ఆహారం తినాలి.
  • వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకు సరైన నిద్ర చాలా అవసరం.