Which Fruit is Rich in Vitamin C, Foods Rich in Vitamin C, Benefits of Vitamin C for Health, How Much Vitamin C Does the Body Need Every day

విటమిన్ సి అధికంగా లభించే ఆహార పదార్థాలు, ఆరోగ్యానికి విటమిన్ సి యొక్క ప్రయోజనాలు, ప్రతిరోజూ శరీరానికి ఎంత విటమిన్ సి అవసరం అవుతుంది, ఏ పండులో సి విటమిన్ అధికంగా ఉంటుంది

విటమిన్ సి శరీరానికి అనేక రకాలుగా అందుతుంది. అందులో కొంచెం కూరగాయల ద్వారా మరికొంచెం మనం తినే పండ్ల ద్వారా శరీరానికి లభిస్తుంది. అత్యధికంగా పుల్లని ఆహార పదార్థాలలో మనకు C విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. నారింజ పండులో కావలసినంత విటమిన్ C ఉంటుంది. ఈ విటమిన్ అనేది శరీరంలో రక్త శుద్ధి కోసం మరియు ఎముకల బలం కోసం ఉపయోగపడుతుంది.

ప్రతి రోజు సగటు మనిషికి 70 నుంచి 90 మిల్లీ గ్రాముల విటమిన్ కావలసి వుంటుంది. అందులో మగ వారికి 90 మిల్లీ గ్రాములు మరియు స్త్రీలకు 70 నుంచి 80 మిల్లీ గ్రాములు అవసరం అవుతుంది.

మరిన్ని విటమిన్ C ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి వ్యాసాన్ని చివరి వరకు చదవండి. అప్పుడు విటమిన్ C యొక్క అన్ని ప్రయోజనాలను పొందగలరు.

విటమిన్ సి లభించే ఆహార పదార్థాలు

  • ఉసిరి
  • నిమ్మకాయ
  • జామకాయ
  • కివి కాయ
  • బొప్పాయి
  • స్ట్రాబెర్రీ
  • టమోటా

ఉసిరికాయ

ఉసిరికాయలో మిల్లి గ్రాముల సి విటమిన్ ఉంటుంది. విటమిన్ సి అనేది ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా దొరికే డి ఉసిరి కాయలోనే. ఉసిరికాయ సంవత్సరంలో కేవలం కొన్ని నెలల్లో మాత్రమే లభిస్తుంది అందువల్ల ఉసిరికాయలు దొరికినప్పుడు వాటితో ఊరగాయలు లేదా పచ్చళ్ళు చేసుకుని సంవత్సరం పొడవునా తినవచ్చు. ఉసిరిని తినడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. ఎముకలు గట్టి పడటానికి మరియు జుట్టు దృఢంగా ఉండేందుకు ఉసిరి బాగా పనిచేస్తుంది.

నిమ్మకాయ

నిమ్మకాయ కూడా ఉసిరికాయలాగా ఒక పుల్లటి పండు. దీనిలో కూడా విటమిన్ సి సమృద్ధిగా దొరుకుతుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం సమయంలో ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది మరియు చెమట రూపంలో బయటికి పోయిన పోషకాలను తిరిగి తెస్తుంది. 100 ml నిమ్మరసంలో 50 మిల్లి గ్రాముల C విటమిన్ ఉంటుంది.

జామకాయ

జామకాయ పుల్లగా లేనప్పటికీ ఇందులో కూడా విటమిన్ సి లభిస్తుంది. అదికూడా నారింజ పండులో కంటే ఎక్కువగా లభిస్తుంది. అంతే కాదు జామపండు తినడం వల్ల ఇందులో వున్న విటమిన్ A మరియు B లు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

కివి కాయ

100 గ్రాముల కివీ పండులో దాదాపు 95 మిల్లి గ్రాముల సి విటమిన్ లభిస్తుంది. ప్రస్తుత కాలంలో బాగా పేరు పొందిన పండు కివి ఫ్రూట్. ఇందులో మానవుని శరీరానికి కావలసిన ఫైబర్, విటమిన్లు మరియు యాంటీ ఆక్సీడెంట్లు లభిస్తాయి. దీని వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది మరియు జ్వరం వచ్చి రక్త కణాలు తగ్గిపోయిన వారు కివి తింటే తిరిగి కణాలను పొందుతారు.

బొప్పాయి

బొప్పాయిని పోషకాల నిధి అన్నారు. బొప్పాయి చెట్టు యొక్క ప్రతి భాగం ఉపయోగపడుతుంది. బొప్పాయిలో విటమిన్లు, పొటాషియం మరియు ఫైబర్ లభిస్తాయి. ఇవి శరీర అవయవాల యొక్క పని తీరుని మెరుగుపరచడానికి సహాయపడతాయి. సి విటమిన్ బొప్పాయిలో మిల్లీ గ్రాముల వారకి లభిస్తుంది.

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీలో విటమిన్ సి బాగా ఉంటుంది. ఇది తినడం వల్ల అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. స్ట్రాబెర్రీలో వున్నా పీచు పదార్ధాలు తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తాయి.

టమోటా మరియు బ్రోకలీ

కురగాయలు అయినటువంటి టమోటా మరియు బ్రోకలిలో కూడ విటమిన్ సి అధికముగా లభిస్తుంది. వీటిని మనం తక్కువ ఖర్చుతో కొనగలము మరియు వీటి వల్ల అధికంగా పోషకాలు శరీరానికి లభిస్తాయి. టమోటాలో 25 మిల్లి గ్రాముల వరకి విటమిన్ సి ఉంటుంది. బ్రోకలీలో 80 - 90 మిల్లి గ్రాముల వరకి విటమిన్ సి ఉంటుంది.

ఆరోగ్యానికి విటమిన్ సి యొక్క ప్రయోజనాలు

  • పెళుసుబారిన ఎముకలను దృఢంగా చేయడానికి ఉపయోగపడుతుంది.
  • శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడానికి విటమిన్ సి సహకరిస్తుంది.
  • చిన్న వయస్సులో వచ్చే ముడుతలను తగ్గించి చర్మాన్ని అందంగా చేసేందుకు ఉపయోగపడుతుంది.
  • కంటి చూపు మెరుగుపడేందుకు కూడా ఉపయోగపడుతుంది.
  • జుట్టు బలంగా మారి పొడవుగా పెరిగేందుకు.
  • చెమట రూపంలో బయటికి పోయిన పోషకాలను తిరిగి తెచ్చేందుకు ఉపయోగపడుతుంది.

ప్రతిరోజూ శరీరానికి ఎంత విటమిన్ సి అవసరం అవుతుంది

సి విటమిన్ లేకుండా బ్రతకడం చాలా కష్టం. అందువల్ల మనకి ప్రతిరోజు సి విటమిన్ అవసరం అవుతుంది. సాధారణంగా 15 - 60 సంవత్సరాల వయస్సు వారికి 70 నుంచి 90 మిల్లి గ్రాముల సి విటమిన్ అవసరం అవుతుంది.