White Stretch Marks - Top 3 Natural Ways to Get Rid of Stretch Marks Permanently

శరీరంపై స్ట్రెచ్ మర్క్స్ (Stretch Marks) తొలగించడం ఎలా ?, How to Remove Stretch Marks Permanently, How to Remove Stretch Marks Permanently on Stomach, Legs, and Hands, Why do Stretch Marks occur?

Gym చేసే ప్రతి ఒక్క వ్యక్తి ఎదుర్కొనే సమస్య స్ట్రెచ్ మర్క్స్ ( Stretch Marks ). ఒక్కసారి Strech Marks వచ్చాయి అంటే శారీరకంగా ఎంతటి బాలాన్ని కలిగి ఉన్నా కూడా తమ కండలు తిరిగిన దేహాన్ని అందరికి చూపించలేకపోతున్నాము అని మానసికంగా కుంగుబాటుకి గురవుతున్నారు. కేవలం మగవారు మాత్రమే కాదు ఆడవాళ్ళు కూడా ఈ Stretch Marks వల్ల బాధ పడుతున్నారు.ఎందుకంటే వల్ల చర్మం ముడతలుపడి అందవిహీనంగా కనిపిస్తారు కాబట్టి.

అసలు Stretch Marks ఎందుకు వస్తాయి?

మహిళల్లో ప్రసవం తర్వాత వచ్చే సమస్యల్లో స్ట్రెచ్ మార్క్స్ ఒకటి. అసలు Stretch Marks ఎందుకు వస్తాయి అంటే ఒక్కసారిగా బరువు పెరగడం, అలాగే తగ్గడం వల్ల శరీరం మీద చారలు వస్తుంటాయి. ఎక్కువగా వ్యాయామాలు చేసి సరిగా ఆహారం తీసుకొని వారిలో ఈ సమస్యలు కనపడుతుంటాయి. లావుగా ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా బరువు తగ్గడం వల్ల ఈ Stretch Marks అనేవి వస్తాయి. అలాగే సన్నగా ఉన్నవాళ్లు ఒక్కసారిగా లావు అవ్వడం వల్ల ఈ శరీరం మీద Stretch Marks వస్తాయి.

బిడ్డకి జన్మనిచ్చిన తల్లి ఆకస్మికంగా బరువు పెరగడం, తగ్గడం వల్ల ఈ చారలు ఎక్కువగా వస్తుంటాయి. Stretch Marks పొట్ట భాగంలోనే కాకుండా భుజాలు, కాళ్లు, చేతుల్లో కూడా వస్తాయి. వీటిని తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే క్రీమ్స్ వాడిన కొన్నిసార్లు ఎలాంటి ప్రయోజనం కనిపించదు.

How to use Neem Leaves to Reduce Chickenpox

శరీరంలో రోగానిరోధక శక్తి పెరగాలంటే ఏమి చేయాలి

విటమిన్ సి అధికంగా లభించే ఆహార పదార్థాలు

జుట్టు పెరుగుదలకి కోడిగుడ్డు మరియు ఆముదం

మన ఇంట్లో దొరికే కొన్ని ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్కల ద్వారా ఈ Stretch Marks చాలా త్వరగా నయం చేసుకోవచ్చు.

ఇంటి వద్దనే Stretch Marksను తొలగించడం ఎలా?

1. కొబ్బరి నూనె చర్మానికి మంచి మాయిశ్చరైసర్ గా పనిచేస్తుంది. మచ్చలపై నేరుగా కొబ్బరి నూనె రాసి మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చారల సమస్య తగ్గుతుంది.

2. పచ్చి బంగాళదుంపను గుండ్రని ముక్కలుగా కట్ చేసి చారలపై రుద్దాలి. దీనివల్ల చర్మకణాలు ఉత్తేజమై మచ్చలు తగ్గుతాయి.

3. తాజా కలబంద గుజ్జును చారలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. తర్వాత నెమ్మదిగా మసాజ్ చేస్తూ 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మన ఇంటి వద్దనే లభించే నిమ్మకాయల యొక్క రసం తీసుకుని దానికి చెంచా విటమిన్ ఈ ఆయిల్ కానీ కీర రసం కానీ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చారలు ఉన్న ప్రదేశంలో రుద్దాలి. తర్వాత పది నిమిషాలు ఆగి శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల చారలు తగ్గిపోతాయి.

వ్యాయామం చేస్తున్న వ్యక్తులు పైన చెప్పిన విధానాలను పాటిస్తే శరీరం పైన వచ్చే సమస్యలను శాశ్వతంగా దూరం చేసుకుంటారు.

ఇలాంటి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మన తెలుగు చిట్కాలు పేజీని ఫాలో అవ్వండి.